కరాటే,సిలంబం పోటీలు ప్రారంభం...కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం...
కరాటే,సిలంబం పోటీలు ప్రారంభంకర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం
కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల క్రీడోత్సావాలలో భా గంగా ఆదివారం కర్నూలు స్టేడియంలో జరిగిన కరాటే,సిలంబం మార్షల్ ఆర్ట్స్ పోటీల కు వివిధ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు.పోటీలను జి ల్లా ఒలంపిక్ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.సునీల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 15సంవత్స రాలుగా క్రీడా స్ఫూర్తిని చాటే ఉద్దేశంతో ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు.క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిల వాలని అయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్,మాస్టర్స్ చంద్రశేఖర్,రమణ,యూనియన్ బాంక్ మేనేజర్ నాగేశ్వరరావు,గ యాజుద్దీన్,షకీల్ అహ్మద్,మున్నాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment