మార్పులతో నగర రూపురేఖలు మార్చాలి...ఇంజనీరింగ్,పట్టణ ప్రణాళిక విభాగాలపై సమీక్ష...

మార్పులతో నగర రూపురేఖలు మార్చాలి
ఇంజనీరింగ్,పట్టణ ప్రణాళిక విభాగాలపై సమీక్ష 
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి 
బ్యానర్లు,పోస్టర్లు అతికించడం మానుకోకపోతే కేసులు
నగరపాలక అధికారులతో మంత్రి టీజీ భరత్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగర రూపురేఖలు మార్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టి,కర్నూలును రా ష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు,సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయు తంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భర త్ నగరపాలక అధికారులను ఆదేశించారు.మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాల నీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్‌ ఎస్.రవీంద్ర బాబుతో కలిసి ఇంజనీ రింగ్,పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు,ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించా రు.ముందుగా గుత్తేదారులతో మాట్లాడారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని,లెస్‌లకు 5శాతం కంటే ఎక్కువ పోవద్దని సూచించారు.
5శాతం కంటే ఎక్కువ లెస్‌లకు టెండర్ వేసిన పనులపై,క్వాలిటీ కంట్రోల్ బోర్డు ద్వారా నాణ్యత ప్రమాణాలు తనిఖీలు చేశాకే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని స్ప ష్టం చేశారు.అదే విధంగా పనులు దక్కించుకుని ప్రారంభించకుండా జాప్యం చేస్తే చర్య లు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.అనంతరం పట్టణ ప్రణాళిక విభాగ అ ధికారులతో,ప్లానింగ్ కార్యదర్శులతో మాట్లాడారు.నగరాన్ని సుందరంగా,అందంగా ఉం డాలంటే పట్టణ ప్రణాళిక సిబ్బంది పర్యవేక్షణ చాలా కీలకమైనదన్నారు.ఆక్రమణలు‌ ఉపే క్షించొద్దని,దీనిపై పైస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.వెండర్స్ జో న్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని,బహిరంగ ప్రదేశాల రహదారులపై తోపుడు బండ్ల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నగరంలో వీధి వ్యాపారులు ఎంతమంది ఉన్నా రో,అనుమతులు ఎంత మంది తీసుకున్నారో వంటి వివరాలను వారంలోగా తనకు అంద జేయాలని ఆదేశించారు.ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో రహదారుల ఆక్రమ ణలపై చర్యలు తీసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలస్యం చేయోద్దని స్పష్టం చేశారు. రహదారులపై,కూడళ్లపై బ్యానర్లు,పోస్టర్లు అతికించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వ్యక్తులు జరిమానాతో వినకపోతే,కేసులు నమోదు చేసేందుకు వెనకాడొద్దని స్పష్టం చేశారు.అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే ఆక్రమణలు తక్షణమే తొలగించాల ని,ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అన్వేషించి వెండర్ జోన్స్ ఏర్పాటు చేయాల ని ఆదేశించారు.ప్రాంతాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు,క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ప్రణా ళిక రూపొందించాలని,అందుకను గుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి,సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి,ఎంఈ లీల ప్రసాద్,పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు,టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష,కార్పొరేటర్ పర మేష్,డిఈఈలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...