పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీలు...నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు...
పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీలునగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5 మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అర్బన్ సచివాలయాల కార్యదర్శుల బదిలీలు పారదర్శకంగా చేపట్టినట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు.శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని కౌన్సిల్ హాల్లో బదిలీలపై కౌన్సిల్ నిర్వహించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మొ త్తం 308 సచివాలయాలు ఉండగా,173 అడ్మినిస్ట్రేటివ్,235 ఎడ్యుకేషన్,248 వెల్ఫేర్, 208 శానిటేషన్ కార్యదర్శులు ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్నారన్నారు.వీరికి ప్రస్తు తం పని చేస్తున్న వార్డు,వారి సొంత వార్డు మినహా ఇతర వార్డులకు బదిలీలు చేయను న్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఆదివారం ప్లానింగ్,అమెనిటీస్ కార్యదర్శుల బదిలీలపై కౌన్సిల్ జరగనుందని వెల్లడించా రు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,ఆర్‌ఓ జునైద్,ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వర్ రెడ్డి,ఆదోని కమి షనర్ ఎం.క్రిష్ణ,నందికొట్కూరు కమిషనర్ బేబి,డోన్ కమిషనర్ ప్రసాద్ గౌడ్,ఎమ్మిగనూ కమిషనర్ ఎం.గంగిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment