రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరు... పట్టణ పౌర సంక్షేమ సంఘం...

రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న మురికి నీరు
ప్రధాన మురుగుకాలువలు శుభ్రం చేయించాం
ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ 
మురుగు,చెత్తతో నిండిన పొర్లి పొంగుతున్న మురికి కాలువలు
ఏడాది క్రితం దాదాపు కోటితో నిర్మించిన మురిగుకాలువలు 
ఎవరికోసం? ఏమయ్యాయి?
రోడ్డుకు ఒకవైపు నిండిన కాలువలు,మరోవైపు ఎండిన కాలువలు
అడ్రస్ లేని ఆరోగ్యశాఖ అధికారులు
పట్టణ పౌర సంక్షేమ సంఘం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో 15 కాలనీలకు వెళ్లే 60అడుగుల ప్రధాన రోడ్డుపై మురిగునీరు ప్రవహి స్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడి గంటలు గడుస్తున్న ప్రజారోగ్య శాఖ అధి కారులు సానిటరీ ఇన్ స్పెక్టర్లు ఏం చేస్తున్నారని పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎ. ఆంజనేయులు గౌడ్,మహమ్మద్ యూనుస్,ఇరిగినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.ఇళ్ళ ముం దు మురికి నీరు ప్రవహిస్తున్నందున బయటికి వెళ్లే పరిస్థితి లేదని అశోక నగర్,శ్రీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఉదయం పిపిఎస్ ఎస్ ప్రతినిధి బృందం ఆ ప్రాం తంలో పర్యటించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల కు పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంపై లేదని విమ ర్శించారు.నగరంలో ఒకటి రెండు ప్రాంతాలు మినహా అన్ని ప్రధాన మురికి కాలువల్లో పేరు కొనిపోయిన మురికిని,చెత్తను తొలగించామని ప్రకటించి 24గంటలు గడవక ముందే అశోక్ నగర్ ప్రధాన మురికి కాలువలు నిండి,60అడుగుల రోడ్డుపై మురికి నీరు ప్రవహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.ఈ ప్రాంతంలో ఏడాది క్రితం దాదాపు కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన మురికి కాలువలు ఎవరికోసం నిర్మించారు? ఆ కా లువలు ఏమయ్యాయని ప్రశ్నించారు.రోడ్డుకు ఒకవైపు కాలువలు నిండి రోడ్డుపై ప్రవహి స్తుంటే మరోపక్క నీళ్లు లేకుండా చెత్త చెదారం పేరుకుపోయిన వట్టి కాలువ దర్శనమి స్తుందన్నారు.రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తున్నందువల్ల స్కూల్ పిల్లలు,స్థానిక ప్రజలు పక్క వీధి మీదుగా వెళ్లే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి ప్రజల అసౌకర్యం కలగడానికి కారణమైన ప్రజారోగ్య అధికారి,శానిటరీ ఇన్ స్పెక్టర్ లపై చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ పర్యటనలో ఎస్.ఆర్.గౌడ్,రఫీ క్,ధనరాజు, ఇస్మాయిల్,నరసింహ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...