రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బంది...
రైతు భూమి నష్టపరిహారం రూ. 10.57 లక్షలు మింగేసిన ప్రభుత్వ సిబ్బందికార్యాలయాల చుట్టూ రైతు ప్రదక్షిణలున్యాయం చేస్తామని ఆర్ డిఓ హామీబి.విజయ్ కుమార్,ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి
VS9TV న్యూస్,ఓర్వకల్ :మనిషి బతకాలంటే ఆహారం కావాలి.కాని నాటి నుండి నేటి వరకు రైతుకు అన్యాయమే జరుగుతుంది.అతివృష్టి, అనావృష్టి,నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు,పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక,చేసిన అప్పులకు వడ్డీలు చె ల్లించలేక రైతు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి నెల కొంది.మరోవైపు రైతుకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది,అదే రైతు భూమిపై వచ్చే నష్టపరిహారం అక్రమం గా మింగేసిన ఘటన కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలంలో జరిగింది.ఈ నేపథ్యంలో రై తుకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ "ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ క రప్షన్ అసోసియేషన్" ను అశ్రాయించాడు.స్పందించిన ఆర్ జిఎన్ హ్యుమన్ రైట్స్ అండ్ ఆంటీ కరప్షన్ అ సోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు విజ య్ కుమార్ లు ఓర్వకల్ మండలం తహసీల్దార్ విద్యాసాగర్ ను కలిసి గురువారం ఘట నకు సంబందించిన విషయాన్ని వివరించారు.రైతుకు న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేశా రు.అనంతరం ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,రైతు కానుగల రాంపుల్లయ్య మీడియాతో మాట్లాడారు.ఓర్వకల్ మండలం,బ్రహ్మణ పల్లె గ్రామానికి చెందిన రాంపుల్లయ్య,కుటుంబ సభ్యులు రాజమ్మ,భా గ్యలక్ష్మిలు సర్వే నంబర్ 121 బి/2లో మొత్తం 1.41ఎకరాలు, అం దులో రాంపుల్లయ్య - 89సెంట్లు,రాజమ్మ - 39 సెంట్లు,భాగ్యలక్ష్మి - 29 సెంట్లు వారస త్వ ఆస్తిగా అన్ని ప్రభుత్వ అనుమతుల తో అనుభవిస్తున్నారని అన్నారు.అందుకు రైతు పే రు మీద పాస్ బుక్ లు, ఆర్ ఓ ఆర్,తదితర పత్రాలు ఉన్నాయి.అదేవిదంగా ప్రభుత్వం ఈ పాస్ ను 15/02/2 021న మంజూరు చేసిందన్నారు.ఇప్పటికీ ఆ పొలం ఆ కుటుంబమే పంటలు పండిస్తు న్నారు.అయితే ప్రజా ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం (ఎపిఐఐసి) 2015,జులై,13వ తేదీన భూ ఆక్రమణ కార్యక్రమం చేపట్టింది.ఇందులో భాగంగా ప్రత్యేక బృందం రీసర్వే చే సినట్లు చెప్పారు.రీసర్వే సమయంలో రైతు రాంపుల్లయ్య,కుటుంబ స భ్యులకు ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారంను దోచేసేందుకు కుట్ర చేసి,అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ సిబ్బంది,అప్పటి తలారి మద్దిలేటి ఆ పొలంను తన పొలంగా,ఆ పొలం కు యజమానురా లుగా తన భార్య తలారి రామాంజనమ్మ పేరుతో నకిలీ పత్రాలు అంద చేసి,అధికారులకు తప్పుడు రిపోర్ట్ అందించాడు.ఈ విధంగా రైతును మోసం చేయడమే కాకుండా,ప్రభు త్వాన్ని,అధికారులను సైతం మోసం చేశాడని ఆరోపించారు.అతను ఇచ్చి న రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం 2022,ఫిబ్రవరి,03వ తేదీన నష్టపరిహారం రూ.10.57 ల క్షలు,చెక్ నంబ ర్ 00 00 67ద్వారా మంజూరు చేయడం జరిగింది.ఆ విధంగా రైతు రాంపుల్లయ్యకు టుంబానికి చెందాల్సిన నష్టపరిహారంను దోచుకున్నట్లు పేర్కొన్నారు.అ ప్పటి నుండి నేటి వరకు న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రైతు ప్రదక్షిణలు చే స్తున్న అధికారులు స్పందించకపోవడం బాధాకరం అన్నారు.ప్రస్తుతం ఈ ఘటన వివరా లు కర్నూలు జిల్లా ఆర్ డిఓ సందీప్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.సానుకూలం గా స్పందించిన ఆ ర్ డిఓ పూర్తి విచారణ జరిపించి,రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇ చ్చారు.అలాగే వి చారణ నిమిత్తం ఓర్వకల్ తహసీల్దార్ విద్యాసాగర్ కు సిఫారస్ చేయ డం జరిగింది.రైతు ను ఆదుకోవాల్సిన అధికారులు ఆ రైతునే భక్షించడం హేయమైన చ ర్యగా వారు ఖండిం చారు.కావున ఇప్పటికైనా అధికారులు రైతును,ప్రభుత్వాన్ని మోసం చేసిన మద్దిలేటిపై తగు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని,బాధిత రైతుకు న్యాయం చేయా లనీ వారు డిమాండ్ చేశారు.
Comments
Post a Comment