ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురు... రూ.10 వేలు అర్థక సహాయం....మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన...

ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురు
రూ.10 వేలు అర్థక సహాయం 
మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన

VS9TV న్యూస్,శ్రీకాకుళం :
ఏపీలోని ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది.రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు,శ్రీకాకుళం జిల్లా,పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి...అన్నదాత సుఖీ భవ పథకం తొలి విడత నిధులను త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామ న్నారు.రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్‌కు కూడా త్వరలోనే రూ. 10వేలు అందిస్తామని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం లో ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న కొల్లు రవీంద్ర...ఇప్పటి వరకూ పది లక్షల కో ట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు.మరోవైపు మహిళల కోసం ఆగస్ట్,15వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్న సంగతి తెలి సిందే.సూపర్ సిక్స్ హామీలలో మాట ఇచ్చిన విధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనుంది.తొలుత జిల్లాల వరకే ఈ పథకాన్ని పరి మితం చేయాలని భావించినప్పటికీ...రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చే యనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు.నారా లోకేష్‌తో చర్చించిన త ర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇక ఉచిత బస్సు పథకం అమల్లో భాగంగా మ హిళలకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ టికెట్ల మీద ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తున్నారు.ఉచిత బస్సు పథకం వలన వారికి ఎంత మేరకు డబ్బు లు ఆదా అయ్యాయనే వివరాలను ముద్రించనున్నారు.దీంతో ఈ పథకం వలన ఎంత మేరకు ప్రయోజనం పొందామో మహిళలకు తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.మరో వైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్లకు గిరాకీ త గ్గుతుందని,ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించిన రోజే ఆటోడ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తామ ని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని అన్నారు.అయితే ఎంతమేరకు అనే దానిపై క్లారిటీ లేకపోగా...తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై క్లారిటీ ఇచ్చారు.ఆటో డ్రైవర్లకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...