గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు... హైదరాబాద్‌లో 10చోట్ల సోదాలు...

గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు
హైదరాబాద్‌లో 10చోట్ల సోదాలు

VS9TV న్యూస్,హైదరాబాద్: 
గొర్రెల స్కాం కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడుగా ముందుకె ళ్తోంది.హైదరాబాద్‌లో 10చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మా రింది.సికింద్రాబాద్,బోయిన్ పల్లి,జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.బీఆ ర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోప ణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ న మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.గొర్రెల కుంభకోణం కేసు లో ఈడీ విచారణను వేగవంతం చేసింది.ఈ స్కాం విలువ సుమారు రూ.700 కోట్ల వర కూ ఉంటుందని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తులో వెల్లడైంది.ఈ కేసులో పెద్దఎ త్తున డబ్బు చేతులు మారడం,ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావ డంతో ఈడీ రంగంలోకి దిగింది.అందుకే మనీ లాండరింగ్‌ కేసుగా ఈడీ విచారణకు స్వీ కరించింది.ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను క లెక్ట్ చేశారు.గొర్రెల పంపిణీ విధివిధానాలు,ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు.2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకా న్ని ప్రారంభించింది.ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రజలకు సుమారు రూ.4,000కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతు న్నాయి.అయితే,ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఈ ఆర్థిక అవకతవకలు చో టుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో గుర్తించింది.గొర్రెల పంపిణీ పథ కాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు,మధ్యవర్తులు కలిసి ప్రభు త్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చె ల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీ బీ దర్యాప్తులో తేలింది.ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీని వాస యాదవ్ హస్తం ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...