జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...18మంది మృతి...
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...18మంది మృతి
జార్ఖండ్‌లోని డియోఘర్,జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గా యపడ్డారు.మంగళవారం తెల్లవారు జామున,4:30 గంటల సమయంలో మోహన్ పూ ర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న బ స్సు,గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఈ సంఘటన గురించి మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ప్రియరంజన్‌కు సమాచారం అందించారు.ఆ తర్వాత ప్రియరంజన్ కుమార్ ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని,మోహన్‌పూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు సమాచారం అందించా రు.సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా మోహన్‌పూర్ సిహెచ్‌సికి పంపారు.ఈ ప్రమాదంపై ఎంపీ నిషికాంత్ దూబే విచారం వ్యక్తం చేశారు.
Comments
Post a Comment