8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి...బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు, మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు...

8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి
బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి,వరుడు,
మధ్యవర్తి,వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు.

VS9TV న్యూస్,నందిగామ :
రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహం కలకలం రేపింది.13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వి వాహం చేసుకున్నాడు.అయితే బాలిక తాను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...రంగారెడ్డి జిల్లా,నందిగామకు ఓ మహిళ భర్త కొన్నేళ్ల కింద ట చనిపోయాడు.ఆమెకు అప్పటికే ఒక కొడుకు,కూతురు ఉన్నారు. ఆమె కూతురు (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది.ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది.కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది.అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెం దిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్‌ గురించి చెప్పాడు.అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు.ఈ క్ర మంలోనే మే,28న ఓ గుడిలో బాలికకు 40ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే బాలిక మైనర్ కావడం,ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని స్కూల్ టీ చర్‌కు తెలియజేసింది.దీంతో వారు మండల అధికారులకు,పోలీసులకు సమాచారం ఇ చ్చారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి,పెళ్లికొడుకు శ్రీ నివాస్,మధ్యవర్తి,వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కిం ద (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్,2006) పోలీసులు కేసు నమోదు చేశారు.అ నంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు.ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రే పింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...