ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సిపిఎం డిమాండ్

VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్,32వ వార్డు,ముజాఫర్ నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠ శాలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు యస్.హుస్సేన్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల తరహాలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని నాలుగు రంగులు వేసి రంగుల ప్రపంచం చూపించడం తప్ప,ప్రభుత్వ పాఠశాలలో సమ స్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయాయని వారు విమర్శించారు. ముజాఫర్ నగర్ హైస్కూల్లో 500 మంది విద్యార్థులకు తగ్గట్లు మరుగుదొడ్లు లేక విద్యార్థు లు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందని,అందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవు తున్నారని తెలిపారు.క్లాస్ రూమ్ లలో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయడం లేదన్నారు.పాఠాలు చెప్పే డిజిటల్ బోర్డుకు సరైన నెట్వర్క్ సౌకర్యం లేదని,ప్రధానంగా ఇంగ్లీష్,హిస్టరీ సబ్జెక్టు లకు సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో బుక్స్ అందలేదని బూట్లు ఇచ్చిన అవి అన్ సైజ్ ఉండడం వల్ల వెనక్కు పంపామని వారు పేర్కొన్నారు.విద్యార్థులు తమ సమ స్యలను సిపిఎం పార్టీ బృందం దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రధానంగా కల్లూ రు,ముజఫర్ నగర్,పందిపాడు,లక్ష్మిపురం తదితర కాలనీలలో చదివే విద్యార్థులు టెన్త్ క్లా స్ తర్వాత ఇంటర్ చదువుకోవడానికి 10కిలోమీటర్లు దూరంలో ఉన్న కోల్స్ కాలేజీ సె యింట్ జోసెఫ్ కాలేజీ ఉస్మానియా కాలేజీలకు వెళ్లాల్సి వస్తుందని,అందువల్ల ముజఫర్ న గర్ లో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగ ప డుతుందని వారు తెలిపారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో వి ద్యార్థులు ఎదుర్కొంటున్న టువంటి సమస్యలను పరిష్కరించి,ముజఫర్ నగర్లో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.జూనియర్ కాలేజీకి తగి న రూములు కూడా ఉన్నాయని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం కార్య కర్తలు కె.సురేష్,మునిస్వామి,జె.రాజు,యం.మహేష్,పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...