ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం...

ప్రమాదంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ దుర్మరణం

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్,మణికొండలో కు మార్తెలను స్కూల్‌ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వే గంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహి ళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసు కుంది.సిఐ సీహెచ్‌.వెంకన్న తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి...ప్రకాశం జిల్లా,కందుకూరు మండలం,కొండముదుసు పా లెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తు న్నారు.మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్‌ వెళ్లగా,వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు.కుమార్తెలను తీసుకొని శాలిని గత సోమవారం రాత్రి మణికొండకు వచ్చిం ది.భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష,9వ తరగతి,చిన్న కుమార్తె సహస్ర,4వ తరగతి చదువుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది.అనంతరం స్కూటీపై తిరిగి వస్తుం డగా మణికొండలోని సుందర్‌ గార్డెన్‌ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో కిందపడి పోయిన శాలిని తల,శరీర భాగాలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెం దినట్లు చెప్పారు.డ్రైవర్‌ నిర్లక్ష్యంగా,అతి వేగంగా ట్యాంకర్‌ నడపడం వల్ల ప్రమాదం జరి గిందని మృతురాలి సోదరుడు లోకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.ఘటన జరి గిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు.ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...