కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యం...డాక్టర్ పి.చంద్రశేఖర్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్...
కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యండాక్టర్ పి.చంద్రశేఖర్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్
కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యం అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు.సోమవారం కర్నూలు మెడికల్ కాలేజ్ ని సం దర్శించిన సందర్భంగా ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి అందరూ దూరదృష్టిలో ఆలోచించి సహకరించాలని ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు.వైఎస్ ఛాన్సలర్ గా వున్నందున ప్రభు త్వ ఉన్నత అధికారులతో మాట్లాడి అభివృద్ధి కి సహకరించే అవకాశం వుందని,ఈ కళా శాల విద్యార్థిగా ఆసుపత్రి సూపర్డెంట్ గా,కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన అభిమానం తో కాలేజి అబివృద్దికి మరింత సహకారం అందిస్తారని కోరారు.ఇందుకు హాస్పిటల్ వై ద్యులు,కాలేజి,వైద్యులు విద్యార్థులు అందరూ కలిసి కట్టుగా సమన్వయం ముందుకి వస్తే పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ డా క్టర్ హరిచరణ్,సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ రేణుకాదేవి,డాక్టర్ సింధియా శుభప్రద,అల్యూమిని వైద్యులు డాక్టర్ కుమార్ స్వా మి రెడ్డి,డాక్టర్ గోవిందరెడ్డి,డాక్టర్ వెంకటరమణ,డా.సుబ్బారెడ్డి,ఏపీ.జి.డి.ఏ అధ్యక్షులు డా.బ్రహ్మాజీ మాస్టర్,డా.విజయ శంకర్,ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు,ఇం జనీరింగ్ సిబ్బంది,అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment