ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి...విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి
పోటి పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి
డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే 
వ్యక్తులను ఎవ్వరిని నమ్మవద్దు...మోసపోవద్దు
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 104 ఫిర్యాదులు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కా ర్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యా ది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదులు :
1) తన కుమారుడు తన బాగోగులు చూడడం లేదని కర్నూలు,ఇందిరా గాంధీ నగర్ కు చెందిన రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు.
2) కర్నూలుకు చెందిన వీరస్వామి నా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎనిమిది లక్షలు, ఐదు తులాల బంగారం తీసుకొని మోసం చేశాడని కర్నూలు,రాధక్రిష్ణ వీధికి చెందిన వి. నాగరాజు ఫిర్యాదు చేశారు.
3) కర్నూలుకు చెందిన హేపెప్సీబా సునీలా కరుణా సాగర్,ఎలిజెబెత్ లు పాస్టర్ లుగా పని చేస్తున్నారు.మార్కెట్ మాస్టర్ అనే యాప్ లో V6 మేనేజర్లుగా పనిచేస్తున్నామని ల క్షలలో డిపాజిట్ ఉందని,వాళ్ళు ఇవ్వకుంటే మేము ఇస్తామని,మీ డబ్బులు ఎక్కడికి పోవూ నమ్మండి,డబ్బులు బాగా వస్తాయని ఎక్కువ మందిని ఈ యాప్ లో చేర్పిస్తే వాళ్లతో పా టు మీకు కూడా రెట్టింపు కమిషన్ లు,బోనస్ లు వస్తాయని నమ్మించారు.ఎక్కువగా అ మాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని గ్రూపులు చేసి ప్రతి ఆదివారం జూమ్ మీటింగ్ తీసుకుంటూ 578 మంది నుండి రూ. 4 కోట్ల వరకు మోసం చేసి తీసుకున్నారు.డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ మాస్టర్ అనే యాప్ బ్లాక్ అయిందని,మీతో పాటు మమ్మల్ని మోసం చేశారని నష్టపోయామని మమ్మల్ని మోసం చేస్తున్నారని కర్నూలుకు చెందిన కళ్యాణి, గౌతమి,రాజేశ్వరి,పద్మ,పద్మావతి,నాగరాజు,విజయభాస్కర్,తాయన్న పలువురు బాధితు లు ఫిర్యాదు చేశారు.
4) నా పొలానికి రస్తా వదలకుండా రైతు గొల్ల నాగప్ప అడ్డుపడుతున్నాడని,రస్తా విష యంలో తనకు న్యాయం చేయాలని కోడుమూరు మండలం,వర్కూరు గ్రామానికి చెందిన జి.రాముడు ఫిర్యాదు చేశారు.
5) వెల్దుర్తికి చెందిన ప్రశాంత్ బాబు ఢిల్లిలో అనురాగ్ అనే వ్యక్తితో తనకు పరిచయాలు ఉన్నాయని,రైల్వే డిపార్ట్ మెంట్ లో కేడర్ కోర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందుకోసం ఇంటర్వూ ఉంటుందని రూ.12.50 లక్షలు నన్ను మోసం చేశాడని కర్నూలు,శ్రీనగర్ కాలనీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేశారు.
6) పంచలింగాల దగ్గర ఉన్న నా వ్యవసాయ భూమిలో ఫారెస్టు వారు గాని లేదా నా అ నుమతి గానీ లేకుండా 10 టేకు చెట్లను జెసిబితో ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ వారు తొల గించారని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం,పంచలింగా ల గ్రామంకు చెందిన మాధవరాజు ఫిర్యాదు చేశారు.
7) బి.టెక్ చేసిన తనకు హైదరాబాద్ కు చెందిన షణ్ముక్ సుదర్శన్ అనే వ్యక్తి కన్సల్టెన్సీ పేరుతో గచ్చిబౌలిలో ఐటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నాలుగు లక్షలు తీసుకొ ని మోసం చేశాడని కర్నూలు,జోహారాపురంకు చెందిన గుణశేఖర్ ఫిర్యాదు చేశారు.ప్ర జా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం వి చారణ జరిపి,బాధితులకు న్యాయం చేస్తామని,సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా,సీఐలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...