అందంతో మురిపించే స్టార్ ల జీవితం ఆనందంగా ఉండదు...
అందంతో మురిపించే స్టార్ ల జీవితం ఆనందంగా ఉండదు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
తమ స్టైల్ తో అందంతో మురిపించే స్టార్ ల జీవితం మనం అనుకున్నంత ఆనందంగా ఉండదు.వాళ్లకు ఎన్ని శారీరిక సమస్యలు ఉన్నా పైకి నవ్వుతూ మేక్ అప్ చాటున ఏడు స్తూ మనల్ని మురిపిస్తారు.అలాంటి వారిలో పలువురు ప్రముఖ హీరోలు సైతం ఉన్నారు. వారిలో...సల్మాన్ ఖాన్ కు (58) ఏళ్ళు అయి పెళ్ళికాకుండా వున్నాడు.గతంలో ఎందరి తోనో వున్న ఈ వ్యక్తి ఇపుడు ఒంటరిగా జీవిస్తూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధ లు బయట పెట్టుకున్నాడు.తనకు నరాల సంబంధ వ్యాధులు ఉన్నట్లు గుర్తించి వైద్యానికి వెళ్లగా తలలో రక్త నాళాలు వాచి ఉన్నట్లు వైద్యానికి కూడా లొంగక ఎపుడు చిట్లుతాయో తెలియని స్థితి.ముఖ కండరాలు వాచి విపరీతంగా నొప్పి నిద్రలేమితో అల్లాడుతూ నరకం చూస్తున్నాను అని చెప్పుకువచ్చాడు.సమంత విషయానికి వస్తే తను చాలా కాలం నుండి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లు దాని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి తేలికగా అలసిపోవడం కళ్ళు తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.ఇది జీవన విధానం మార్చుకుంటే కొంత కంట్రోల్ చేసుకోవచ్చు తప్ప మం దుల ద్వారా తగ్గే వ్యాధి కాదు.అమితాబ్ బచ్చన్ (82) ఏళ్ళు వచ్చి సినిమాల్లో నటిస్తూ వు న్న కౌన్ బనేగా కరోడ్ పతిలో తన అంతరంగం తెలియచేస్తూ 1984లో మైస్తేనియా గ్రే విస్ అనే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వచ్చినట్లు అది మందులకు తగ్గేది కాదు అని నరాలకు కండరాలకు అనుసంధానంలోపించి ముద్ద మింగలేక పోవడం,వస్తువులు రెండుగా కని పించడం,కళ్ళు పొడిబారిపోవడం జరుగుతూ వుంటే తెలిసిన స్నేహితుడి ద్వారా బెంగ ళూరులో డాక్టర్ నీ కలవగ రోగం తగ్గేది లేదని,కంట్రోల్ కు తుదివరకు మందులు వాడా లని సూచించారు.నేటికి ఆ మందులు వాడుతూ వున్నాడు.మమతా మోహన్ దాస్ సిం గ ర్ గా నటిగా సుపరిచితురాలు కెరీర్ పీక్ లో ఉండగా 2010లో కాన్సర్ బారిన పడింది. కోలుకున్నాక 2011లో పెళ్లి చేసుకొని,అతన్ని సంతోష పెట్టలేక విడాకులు తీసుకుంది మళ్ళీ క్యాన్సర్ తిరగబడితే వైద్యం చేయించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి పోతూ వుంది.ఆండ్రియా అనే తమిళ స్టార్ నటి కనుబొమ్మలు,రెప్పలు తెల్లగా వచ్చే బారిన పడింది.సింగర్ గా నటిగా లిరిక్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.పోలి వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న పూర్తి చికిత్స లేదని తెలిపింది.స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సుహాసిని చిన్నతనంలో టిబి బారిన పడింది.అప్పుడు త్వరగా చికి త్స చేయించుకోవడంతో తగ్గిన ఇటీవల మళ్ళీ తిరగబెట్టినట్లు ఎవరికి తెలియనివ్వలేదు అని తెలిస్తే ఎవరు దగ్గరకు రానివ్వరని గుట్టుగా పెట్టుకున్న వినికిడి సమస్యలతో బాధ ప డుతూ ఉన్నట్లు తెలియ చేసింది.ముమైత్ ఖాన్ కూడా తన ఆరోగ్య సమస్యల గురించి ప్ర స్తావిస్తూ ఒక సారి డాన్స్ చేస్తూ,పడిపోగా పదిహేను రోజులు కోమలో వుండగా తలలో నరాలు తెగితే దానిబదులు వైర్లను అమర్చగా మధ్యలో ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉన్నట్లు వై ద్యం లేదు అని తీవ్రత లేకుండా మందులు వాడుతున్నట్లు చెప్పింది.పాన్ ఇండియా హీరో గా అత్యంత రెమ్యూనరేషను తీసుకునే ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలి చేస్తూ వున్న సమయంలో యాక్షన్ సన్నివేశంలో మోకాలికి దెబ్బ తగిలి యాంటీరియర్ లిగమెంట్ పైన్ తో బాధపడుతూ విదేశాలలో చికిత్ఛ పొంది ఆపరేషన్ చేయించుకున్న,నొప్పి తగ్గక పో వడం,గంటల తరబడి నుంచుని,నొప్పులు ఎక్కువై మందులు వాడుతూ దీనివల్ల జుట్టు మొత్తం రాలిపోయి విగ్ వాడుతూ ఫాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు.

Comments
Post a Comment