సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌...

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌

VS9TV న్యూస్,హైదారాబాద్ : 
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సిగాచి పరిశ్రమ ఘోర పేలుడు ప్రమాదంపై తెలం గాణ హైకోర్టులో పిల్‌ దాఖలు అయ్యింది.సిగాచి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటిం చలేదని న్యాయవాది కె.బాబూరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.దీంతో సిగాచి ప రిశ్రమ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.మూడు వారా ల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.పేలుడు ఘటనలో ఇంకా ఎ నిమిది మంది ఆచూకీ లభించలేదని ఫిటిషన్‌లో పేర్కొన్నారు బాబూరావు.బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని స్పష్టం చేశారు.సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని...ప్రమాదంపై సీఎం ఏర్పాటు చేసిన క మిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.పటాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జూన్‌,30న సంభవించిన ఘోర పే లుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు,గాయపడిన వారికి న్యాయం చేయాలని పిటిషనర్ కోరారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని,సిగాచి పరిశ్రమ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంద ని ఆయన తెలిపారు.అయితే,వాస్తవానికి 163మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గే టు వద్ద ఉన్న రిజిస్టర్లు,సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు.గల్లంతైన ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి వారి మృతదేహాలు లభ్యం కానప్పటికీ వారిని మరణించిన వారి కిందనే ప్రకటించి పరిహారం అందించాలని కోరారు.ఈ దుర్ఘటనలో బాధితులకు పూర్తి సత్వర న్యాయం జరగాలని,భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పున రావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కోర్టుకు కె.బాబూ రావు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ప్రకటించిన కోటి పరిహారం విషయంలో క్లారిటీ లేదని, విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు.కాగా సి గాచి పరిశ్రమ ఘటన తెలంగాణ రాష్ట్రం వారికే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన కా ర్మికుల కుటుంబాల కు కన్నీటి కథలను మిగిల్చింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...