బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం”... పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు...

బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం”
వీర్యం,అండాల దందాలో వికృత పార్శ్వాలు
చదువురానివారికైతే...బిర్యానీ పొట్లం, మందు బాటిల్
విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ
అండ దానం చేసే మహిళలకు రూ.20-రూ.25 వేలు
పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
వీర్యం,అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది.సంతాన భా గ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.ఆ దాతలు బాగా చదు వుకున్నవారై,మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు.కానీ...ఈ దందా న డిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు,అడ్డాకూలీల వీర్యాన్ని,అండాలను.'ఇండి యన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్' పేరుతో సికింద్రాబాద్ లో ఈ దందా నడుపుతున్న ఏ డుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తు పోయే విషయాలు వెలుగుచూశాయి.ఈ క్లినిక్ యజమాని, మేనేజర్ గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా,టెక్నీషియన్లుగా నియమించుకున్నా డు.వారు..బిచ్చగాళ్లకు,అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు.ఆర్ట్ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) నిబంధనల ప్రకారం ఆరో గ్యవంతులైన వ్యక్తుల నుంచి,అదీ 21 నుంచి 55 ఏళ్లలోపు ఉన్నవారి నుంచి...వారికి అ న్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించి, ఎలాంటి జన్యువ్యాధులు, అంటువ్యాధులు లేవని ని ర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్ఠంగా 25సా ర్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి.ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒకసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి.కానీ...స్పెర్మ్ క్లినిక్ లు ఈ నిబంధనల న్నింటినీ తోసిరాజని ఒకే వ్యక్తి నుంచి వారానికొకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నాయి. ఉదాహరణకు...ఇండియన్ స్పెర్మ్టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్లు,అడ్డాకూలీలను సంప్రదించి.. "వారానికోసారి ఇక్కడకు వచ్చి మేం చెప్పినట్లు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇప్పిస్తా మంటూ వారికి ఆశపెట్టేవారని తెలిసింది.లేదంటే వాటికి సరిపడా రూ. 500- రూ.10 00 చేతిలో పెట్టి పంపేవారని సమాచారం.అలా వచ్చేవారు...తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే...వారి నుంచి అండాలు సేకరించేవారు.అది కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారీ రూ.20 వేల నుంచి రూ.25 వేలు చెల్లించేవారని తెలిసింది.నిం దితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచా రించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టు లో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...