తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులు...గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర...

తాగేందుకు బోరు నీళ్లు...అన్నంలో పురుగులు
గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర
50రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన కరువు 
రోడ్డెక్కిన విద్యార్థులు
హాస్టల్‌కు అదనపు కలెక్టర్‌
సమస్యలు పరిష్కరిస్తామని హామీ

VS9TV న్యూస్,అలంపూర్‌ :  
సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని,తమ గోడును ఏకంగా కలెక్టర్‌కే చెప్పుకుం టామంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు పాదయాత్రగా బయలుదేరారు.పోలీసులు న చ్చజెప్పినా ససేమిరా అన్న విద్యార్థులు అడుగు ముందుకే వేశారు.జోగుళాంబ గద్వాల జి ల్లా,ఉండవల్లి మండలం,పుల్లూరు గ్రామ శివారు అలంపూర్‌ చౌరస్తాలోని మహాత్మా జ్యో తిభాఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆరేళ్లుగా ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తు న్నారు.5 నుంచి 10వ తరగతి వరకు 480మంది,ఇంటర్‌లో 80మంది కలిపి మొత్తం 560 మంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని 50 రోజులుగా మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు.ఏకంగా జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటామంటూ తొమ్మిదవ,పదవ తరగతికి చెందిన 59మంది విద్యార్థులు రోడ్డెక్కారు.45కి.మీ.దూ రంలో ఉన్న కలెక్టరేట్‌కు పాదయాత్ర చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా విద్యార్థు లు వినలేదు.సుమారు 9కి.మీ.వరకు వెళ్లారు.ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు.50రోజులుగా తాము బోరు నీరే తాగుతున్నామని,ఉపాధ్యాయులు మాత్రం ఫిల్టర్‌ నీళ్లు తాగుతున్నారని,తమకు సరిపడా మరుగుదొడ్లు కూడా లేవని,దీంతో బహిర్భూమికి బయటకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్న 16 మరుగు దొడ్లను మరమ్మతు పేరిట భవన యజమాని మూసివేయించారని ఆరోపించారు.ఈ మధ్య తాము తింటున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా...పట్టించుకోవడం లేదని వాపోయారు.మళ్లీ జోక్యం చేసుకున్న ఉండవల్లి,మానవపాడు ఎస్సైలు శేఖర్‌, చంద్రకాంత్‌...మరికొంతమంది పోలీసులు కలిసి...ఇటిక్యాలపల్లి స్టేజీ వద్ద విద్యార్థులను సముదాయించారు.మీ సమస్యలు వినేందుకు జిల్లా అధికారులే మీ వద్దకు వచ్చేలా ఏర్పా ట్లు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చి అతి కష్టంమీద వారిని ఓ డీసీఎంలో ఎ క్కించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు.విషయం తెలిసిన అడిషనల్‌ కలెక్టర్‌ నర్సింగరా వు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు.యుద్ధప్రాతిపదికన 30మరు గుదొడ్లు నిర్మిస్తామని,తాగునీటి వసతి కల్పిస్తామని,నాణ్యమైన బియ్యంతో భోజనం అం దిస్తామని,విద్యార్థుల సమస్యలు వినేందుకు ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తామని హామీ ఇ చ్చారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....