ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చా... సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం...

ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చా
సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం
ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద ఘటన
పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబం
మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన స్థానికులు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
సెల్ఫీ మోజులో ఓ కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది.ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ స మీపంలోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద నిన్న జరిగిందీ ఘటన.పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జలపా తాన్ని సందర్శించారు.అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవా హంలో కొట్టుకుపోయారు.అప్రమత్తమైన స్థానికులు,మత్స్యకారులు వెంటనే స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది.సాక్షుల కథనం ప్రకారం...భటిండా జలపాతం వద్ద వే గంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు బాధిత కుటుం బం ప్రయత్నించింది.ఈ క్రమంలో కుటుంబంలోని ఒక మహిళ అకస్మాత్తుగా కాలు జారి నీటిలో పడిపోయింది.వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త,కొడుకు, కూతురు ఆమెను రక్షిం చేందుకు వెంటనే నీటిలోకి దూకారు.అయితే జలపాతం వద్ద ఉన్న బలమైన ప్రవాహం కా రణంగా నలుగురూ మునిగిపోయారు.సమీపంలో చేపలు పట్టుకుంటున్న స్థానికులు గమ నించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్లలో దూకి వారిని రక్షించి ఒడ్డుకు తీ సుకొచ్చారు.భటిండా జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురైన ఘటనలు గ తంలోనూ జరిగాయి.2024 ఆగస్ట్ లో సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు కొట్టుకు పోగా స్థానికులు వారిని రక్షించారు.కాగా,తాజాగా ప్రమాదం నుంచి బయటపడిన కు టుంబ సభ్యులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...