మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి... ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే...
మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలిధన్ఖడ్ రాజీనామాపై ఖర్గే
ఆరోగ్య కారణాలతో ఉప రాష్ట్రపతి పదవికి జూలై,21న జగ్‌దీప్ ధన్‌ఖఢ్ రాజీనామా చేసి నప్పటికీ ఆయన రాజీనామాకు కారణాలపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.దీ నిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి,జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కూ మధ్య అంశమని అన్నారు. అసలైన కారణం ఏమిటనే దానిపై తనకు సమాచారం లేదని చెప్పారు.రైతులకు అనుకూలంగా మాట్లాడి నందుకే ధన్‌ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్ర శ్నకు ఖర్గే స్పందిస్తూ ఆ విషయాలు తనకు తెలియవని,ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షా నే ఉండేవారని,అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.రాజ్యసభ చైర్మన్ గా జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన హయాంలో ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవార ని,కీలక అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలకు తరచు అనుమతి నిరాకరించేవారని ఖర్గే వ్యాఖ్యానించారు.రైతులు,పేదలు,అంతర్జాతీయ అంశాలు,విదేశాంగ విధానం వంటి ప లు అంశాలపై ఏరోజూ రాజ్యసభ చైర్మన్‌గా ఆయన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేద ని విమర్శించారు.దళిత మహిళలు, దళితులు,అట్టడుగు వర్గాలపై అకృత్యాలు,హిందూ-ముస్లిం ఘర్షణల ఘటనలు వంటి అంశాలపై నోటీసులు ఇచ్చి ప్రస్తావించేందుకు ప్రయ త్నించినప్పుడు కూడా తమకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు.ధన్‌ఖడ్ ఎందుకు రా జీనామా చేశారనేది ఆయనకు,మోదీకి మధ్య అంశమని,ఆ కారణం ఏమిటనేది చెప్పా ల్సింది కూడా ఆయనేనని అన్నారు.
Comments
Post a Comment