విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలు....

విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు 
డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలు
మహిళల భద్రతకు మేమున్నామంటూ 
భరోసా కల్పిస్తున్న కర్నూలు పోలీసులు
విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలోని ఆర్ ఎస్ రోడ్డు లో ఉన్న కెవిఆర్ కళాశాల,మౌర్యన్ దగ్గర ఉన్న చైత న్య కళాశాలల సమీపంలో ఆకతాయిల ఆటకట్టించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో శక్తీ టీం పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. సోమవారం శక్తి టీమ్ సిఐ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బాలికలు,మహిళలకు భద్రతపై భ రోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడే వా రిపై దృష్టి సారించారు.పాఠశాలలు,కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ వంటి సంఘ టనలు ఎదుర్కొనకుండా ఉండేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు.మహిళలను,అమ్మాయిలను వేధిం చే ఆకతాయిలను,అనుమానితులను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి,వారిని అదుపులోకి తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టారు.మహిళల,అమ్మాయిల భద్రత మరియు శాం తి భద్రతలను కాపాడేందుకు కర్నూలు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తు న్నారన్నారు.డ్రోన్ పర్యవేక్షణతో పాటు పోలీసు బృందాలు కూడా పటిష్టమైన పెట్రోలింగ్ చేపట్టాయి.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ విజయలక్ష్మీ,'శక్తి' టీమ్ సిబ్బం ది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...