బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి...జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష... విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

బ్యాంకులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసుకోవాలి
నేర నివారణే ప్రథమ లక్ష్యం
ఖాతాదారులను హెచ్చరిస్తూ సైబర్ మోసాలను తెలియజేయాలి
భద్రతా ప్రమాణాలపై జిల్లాలోని బ్యాంకర్లతో సమీక్ష
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
నేర నివారణే ప్రథమ లక్ష్యంగా కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.బ్యాంకుల భద్రతా ప్రమా ణాలపై జిల్లా ఎస్పీ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో బుధవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇటీవల మ ధ్యప్రదేశ్,మహరాష్ట్ర,తమిళనాడు,హర్యానా వంటి పలు రాష్ట్రాలలో హైవే ప్రక్కన ఉన్న బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను గుర్తుచేశారు.అలాంటి సంఘటనలు జిల్లాలో జరగ కుండా బ్యాంకు అధికారులు పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఈ సంథ ర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...బ్యాంకు లోపల,బయట అన్ని ప్రదేశా ల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రత చట్టం ప్రకారం మన్నిక కలిగిన సెన్సార్ సీసీ కెమెరాలు, బ్యాంకులలో దొంగలు పడిన వెంటనే అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ అలారం మోగే విధంగా అందరూ అప్రమత్తం అయి బ్యాంకు వారికి మెసెజ్లు,అలర్ట్స్ వచ్చే విధంగా భధ్రత ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ప్రతి బ్యాంకులో సెక్యూరిటీ గార్డులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.లారీ డ్రైవర్లు లా రీలలో కార్లను డెలివరీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి దొంగతనాలకు పాల్పడు తున్నారన్నారు.సెలవు రోజులలో రెక్కి చేస్తారన్నారు. కొందరి ఖాతాదారుల ఖాతాలలో అతి పెద్ద మొత్తాలలో లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉం టూ సైబర్ నేరగాళ్ల గురించి ఖాతా దారులను అప్రమత్తం చేయాలన్నారు. ఓటీపీ ప్రాఢ్స్, ఎపికె ఫైల్స్, డిజిటల్ ప్రాఢ్స్,ఇన్వెస్టిమెంట్ ప్రాఢ్స్ గురించి ఖాతాదారులకు బ్యాంకులలో హెచ్చరిస్తూ సైబర్ మోసాల గురించి తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా లన్నారు.జిల్లాలోని పోలీసు అధికారులందరూ బ్యాంకులను సందర్శించి సెక్యూరిటీ ప రంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బ్యాంక్ అధికారులతో మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్,ఎస్బి ఐ మేనేజర్ అబ్దుల్ రావూఫ్,కరూర్ వైశ్య బ్యాంక్ పీరయ్య,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూ ర్తి,కర్నూలు పట్టణ సిఐలు రామయ్య నాయుడు,నాగరాజా రావు,శ్రీధర్,విక్రమ్ సింహా, చంద్రబాబు నాయుడు,మన్సురుద్దీన్,నాగశేఖర్,సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్,ఎస్సై లు,సైబర్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...