నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండి...డివైఎఫ్ ఐ...

నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండి
డివైఎఫ్ ఐ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా వ్యాప్తంగా సరైన నాణ్యత అందించకుండా,పరిశుభ్రత పాటించకుండా ప్ర జల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా కలెక్టర్ రంజిత్ భాషకి విజ్ఞప్తి చేశారు.సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులు సరైన శుభ్రత నాణ్యత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తెలియ చేశారు.జిల్లా వ్యాప్తంగా చాలా మంది ప్రజలు గ్యాస్ట్రిక్ అల్సర్ ఇతర అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు అని అన్నారు.డాక్టర్లు సైతం హోటల్స్ లో చేసే భోజనాలు ఆరోగ్యా నికి మంచివి కాదని అంటున్నట్టు తెలియజేశారు.అలాగే ధరలు పెరుగుతున్నాయని సా కు చెప్పి విపరీతమైన ధరలు పెంచి ప్రజల కష్టాన్ని కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటు న్నారని అన్నారు.ఒక్కో హోటల్లో ఒక్కో ధర పెడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాంసాహారం నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్లో పెట్టి,కల్తీ నూనె వాడి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న పరిస్థితి ఉందన్నారు.ప్రభుత్వ నిబంధనలు చాలా హోటల్లో పాటిస్తున్న పరిస్థితి లేదని అలాంటి హోటల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వి నతి పత్రం అందించిన వారిలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్,నాయకులు గోవర్ధన్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...