బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...విద్యార్థినులకు అస్వస్థత...తల్లిదండ్రుల ఆందోళన...
బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడువిద్యార్థినులకు అస్వస్థతతల్లిదండ్రుల ఆందోళన
తిరుపతి జిల్లా,కోట మండలంలోని జడ్పీ హైస్కూల్ బాలికల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.యూనిఫామ్ లేకుండా స్కూల్‌కు వచ్చారనే చిన్న కారణంతో క్రీడా ఉ పాధ్యాయుడు సుబాన్ దుర్మార్గంగా ప్రవర్తించారు.సుమారు పదిమంది విద్యార్థినిలను లై న్లలో నిలబెట్టి గుంజిళ్లు తీయిస్తూ శారీరక శిక్ష విధించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది .ఈ ఘటనతో విద్యార్థినుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. శారీరకంగా తట్టుకోలేక పదిమందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సిబ్బంది సహాయం తో బాధిత విద్యార్థినులను కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాధితులందరూ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థినులే కావడం గమనా ర్హం.ఈ అంశం కులపరమైన కోణంలోనూ చర్చనీయాంశమవుతోంది.ఈ సమాచారం తె లిసిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ఆం దోళనకు దిగారు. "మా పిల్లలపై ఎందుకు ఇలా అనుచితంగా ప్రవర్తించారు?", "ఇది చ దివించే గురువు ప్రవర్తనా?", అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దోషిపై వెంటనే క్రిమినల్ కే సు నమోదు చేసి,విధుల నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కోట పట్టణంలో ఈ ఘటనపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.గ్రామస్థులు,వి ద్యార్థుల తల్లిదండ్రులు,హాస్టల్ సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు.స్థానిక ప్రజాప్రతినిధు లు,విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే విచారణ ప్రారంభించాలని ప్రతిఒక్కరు డి మాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై మండల విద్యాధికారి (MEO),జిల్లా విద్యా శాఖ అధికారులు,పోలీసు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతు న్నారు.ఇక ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Post a Comment