బాబు షూరిటీ మోసం గ్యారెంటీ...కల్ల బొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం...ఎస్.వి.మోహన్ రెడ్డి,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు...
బాబు షూరిటీ మోసం గ్యారెంటీకల్ల బొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంప్రజా విశ్వాసం కోల్పోయిందిఎస్.వి.మోహన్ రెడ్డి,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి,ఉమ్మడి క ర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు విజయ మనోజ్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు.ఈ సందర్భం గా ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని చెప్పి చిట్ట చివరకు వారికి మోసం మాత్రం తప్పక చేస్తానని మరొక సారి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని విమర్శించారు.ప్రజా క్షేత్రంలో ఎవరై నా సరే ప్రజలకు సేవ చేయాలని,తపన పడతారని అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ప్ర జలకు మోసం చేస్తుంది ఆయన విమర్శించారు.ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సంక్షే మం కొరకు వైఎస్ఆర్సిపి పార్టీ ముందు ఉంటుందని ఆయన తెలిపారు.ఎస్.వి.విజయ మ నోహరి మాట్లాడుతూ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి రూ.1500 చెల్లిస్తానని,ఉచిత బస్సు ప్ర యాణం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇప్పుడు వా టిని పక్కన పెడుతున్నాడని,ఇది చాలా దారుణమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ఆర్సిపి కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి,షేక్ అహమద్,కృష్ణకాంత్,వాసు,సీనియర్ నాయ కులు అనుబంధ విభాగం అధ్యక్షులు, వార్డు ఇన్చార్జిలు,భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment