నేడు ఆదోనిలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి...1000మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...
నేడు ఆదోనిలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి1000మంది పోలీసులతో పటిష్ట బందోబస్తునిమజ్జనం కార్యక్రమం అంతా డ్రోన్,బాడి ఓన్ కెమెరాలు,సిసికెమెరాలు,విడియో కెమెరాలతో చిత్రికీరణప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టాంజిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలివిక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు జిల్లాలో నేటితో గణేష్ ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో నేడు ఆదోనిలో 448,కోడుమూరు, గూడురులలో 97 వినాయక విగ్రహాల నిమజ్జనం జర గనున్న సంధర్బంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భారీ బందోబస్తుతో భద్ర తా చర్యలు చేపట్టిందని,ప్రశాంత వాతవరణంలో శాంతియుతంగా నిర్వహించుకునేం దుకు అవసరమైన అన్ని ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.బందోబస్తు విధులలో ఇద్దరు అడిషన ల్ ఎస్పీలు,5 మంది డిఎస్పీలు,40మంది సిఐలు మరియు ఆర్ ఐలు,60మంది ఎస్సైలు, 122మంది ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్,264మంది పోలీసు కానిస్టేబుల్స్,20 స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సు,79మంది స్పెషల్ పార్టీ పోలీసులు,201మంది హోంగార్డులు, రూఫ్ పార్టీ,మొబైల్ పార్టీ పోలీసులను భారీ సంఖ్యలో మోహరింప చేశామన్నారు.ఎవ రికీ అసౌకర్యం కలగకుండా,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిమజ్జన ప్రక్రియ సంతోషం గా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు,గణేష్ ఉత్సవ విగ్రహా నిర్వహకులకు ఈ క్రింది సూచనలు,సలహాలు తెలియజేశారు.విగ్రహాల నిర్వహకులు సమయపాలన పాటి స్తూ విగ్రహాల ఊరేగింపుకు అవసరమైన వాహానాలను,క్రేన్లను సిధ్దంగా ఉంచుకోవాల న్నారు.విగ్రహాల ఊరేగింపు వాహనాలపై చిన్నపిల్లలు ఉండకుండా ప్రమాదాల బారిన పడ కుండా చూసుకోవాలన్నారు.నిమజ్జన సమయంలో పిల్లలు,మహిళలు,వృద్దులను దూరం గా ఉంచాలన్నారు.ఊరేగింపులో వినాయక విగ్రహాలు తరలించే సమయంలో కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇతరుల మనోభావాలను గౌరవించాల న్నారు. నిబంధనలకు ఎవరు విరుద్ధంగా ప్రవర్తించరాదన్నారు.అల్లరి మూకలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.బాంబు డిస్పోజబుల్,డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.అనుమానిత వస్తువులుగాని,వ్యక్తులుగాని తారసపడితే డయల్ 100,డయల్ 112, స్ధానిక పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలన్నారు.జిల్లా ప్ర జలు,మతపెద్దలు,రాజకీయ పార్టీలు,యువత,మీడియా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతం గా జరిగేందుకు సహాయ సహాకారాలు అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment