డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరణ...డ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలియజేయండి...ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ...
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరణడ్రగ్స్ సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 నెంబరుకు తెలియజేయండిప్రజలు,యువత ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కు తెలపండి ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ
డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని,సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదామని,ప్రజ లు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పి లుపునిచ్చారు.శనివారం కర్నూలు,దూపాడు దగ్గర ఉన్న అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ క ళాశాలలో ఈగల్ ఐజి పాల్గొని " డ్రగ్స్ వద్దు బ్రో "అనే కార్యక్రమంపై అవగాహన చేశా రు.ఈ సందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ...డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ పోస్టర్స్ ఆవిష్కణలో డ్రగ్స్ మిమ్మల్నే కాదు,మీ కుటుంబాలని నాశనం చేస్తుంది, బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లలపై అఘాయిత్యాలు,డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోంటున్న విద్యార్దులు అవగాహనా పెంచు కోవాలని అన్నారు.యువత తప్పు ద్రోవ పడకూడదన్నారు.విద్యార్దులు బాగా చదువుకో వాలన్నారు.ప్రజల జీవితాలు,ఆరోగ్యాలతో చెలగాటమాడే డ్రగ్స్,గంజాయిను సమిష్టిగా ని రోధించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్,గంజాయిని కట్టడి చేయడం కోసం రాష్ట్ర వ్యా ప్తంగా ఈగల్ పేరుతో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు.ఎక్కడైనా గంజాయి సాగు,డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు,వినియోగం,తదితరాల గురించి సమా చారం టోల్ ఫ్రీ నంబర్ 1972కు అందించాలన్నారు.వారి వివరాలు గోప్యంగా ఉంచు తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఆర్.హనుమంత రావు,అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ రమాదేవి,అశోక గ్రూప్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ సిఈఓ డా.హరికృష్ణ,అశోక్ ఇంజనిరింగ్ కళాశాల ప్రిన్సిపా ల్ డా.ఆర్.నవీన్,ఈగల్ టీం పోలీసు అధికారులు,సిఐ ప్రసాద్,ఎస్సై సుజన్ కుమార్,పో లీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment