క్వింటం రూ.2000 మద్దత్తు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలి...కలెక్టర్ ను కోరిన సిపిఎం బృందం...

క్వింటం రూ.2000 మద్దత్తు ధర ప్రకటించి 
ఉల్లి రైతును ఆదుకోవాలి
కలెక్టర్ ను కోరిన సిపిఎం బృందం

VS9TV న్యూస్,కర్నూలు అగ్రికల్చర్ :
కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక పంటగా ఉల్లి ఉందని,ఉల్లికి రూ.2000 క్విం టాకు మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా క లెక్టర్ ను కోరారు.శుక్రవారం కర్నూల్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డును సంద ర్శించి ఉల్లి రైతులతో మాట్లాడడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్,జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య లకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌ స్ దేశాయి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.యస్. రాధాకృష్ణ,యం.డి.ఆనంద్ బాబు,టి. రాముడు,జిల్లా కమిటి సభ్యులు వై.నగేష్ లు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించా రు.అనంతరం ఉల్లితో మార్కెట్ కు వచ్చిన రైతులతో మాట్లాడి మరిన్ని సమస్యలు అడిగి తె లుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వేసిన రెండవ పంటగా ఉల్లి ఉందని,అలాంటి ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంద న్నా రు.కోడుమూరు మండలం గోరంట్ల నుండి మాధవస్వామి అనే రైతు నాలుగు రోజుల క్రి తం 39 బస్తాలను మార్కెట్ కు తీసుకుని వచ్చి, పట్టి రాసే దిక్కు లేక,రోజు ఆరబోసి ఎత్తు కునేందుకు సహితం కూలీ పెట్టుకోలేక తన ఉల్లిగడ్డలను మార్కెట్లోనే పారబోసి ఇంటికి వె ళ్లిపోయాడన్నారు.గోనెగండ్ల మండలం ఆలువాల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే రైతు 170 బస్తాల ఉల్లిగడ్డలు మార్కెట్కు తెచ్చి గ్రేడింగ్ కోసం 30బస్తాలు కింద పోస్తే,గ్రేడింగ్ చేసే కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా అమ్మితే వచ్చే పరిస్థితి లేదని లబోదిబోమన్నారని తెలి యజేశారు.ఒక కింటం ఉల్లిగడ్డ పెట్టుబడి రూ.1000,కోత కోసి కుప్పపొసేందుకే రూ.5 00,దాన్ని మార్కెట్ కు చేర్చేందుకు రూ.200,రైతు శ్రమకు ఎలాంటి విలువ లేకుం డానే రూ.1700 ఖర్చు అవుతుందని,అయితే రాష్ట్ర ప్రభుత్వం క్వింటం ఉల్లికి రూ.1200 మద్ద తు ధర ప్రకటిస్తున్నట్లు తెలియజేసిందన్నారు.అయితే రైతులు మాకు రూ.600 కూడా రా వడంలేదని ఏడుస్తున్నారన్నారు.రైతులకు ఉలిక్కి క్వింటానికి రూ.2000 మద్దతు ధర ఇ చ్చే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వారు కలెక్టర్ ని కోరారు. ప్రభుత్వం ప్రక టించిన ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులపై చర్యలు తీసుకోవాలని లే నిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....