వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ తేదీన బస్సు రూట్ మార్పు... మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...
వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ తేదీన బస్సు రూట్ మార్పుమన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనంను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వ తేదీన బ స్సు రూట్ మార్పులు చేస్తున్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ శుక్రవారం ఒక ప్రక టనలో పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు,కర్నూలు డిఎస్పి బా బు ప్రసాద్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం చేసినట్లు చె ప్పారు.ఈ నెల 31వ తేదీ నుండి డోన్,అనంతపురం,బెంగుళూరు వైపు నుండి వచ్చు ఆర్ టిసి బస్సులు గుత్తి పెట్రోల్ బంకు,చెన్నమ్మ సర్కిల్,బళ్లారి చౌరస్తా మీదుగా ఆర్ టిసి బ స్టాండ్ కు చేరుకుంటాయి.అదేవిదంగా డోన్,అనంతపురం,బెంగుళూరు వెళ్ళు బస్సులు క ల్లూరు మీదుగా చెన్నమ్మ సర్కిల్,గుత్తి పెట్రోల్ బంక్ మీదుగా వెళతాయని సూచించారు. కావున కర్నూలు పట్టణ ప్రజలు ఈ విషయం గుర్తించాలని అన్నారు.ఈ నేపథ్యంలో తమ ప్రయాణాలు కొనసాగించాలి.దూర ప్రాంతాల్లో ఉన్న తమకు సంబంధించిన వారికి,బం ధువులకు కర్నూలు పట్టణంలో ఆర్ టిసి బస్సుల మళ్లింపు సమాచారంను తెలియజేసి వా రి ప్రయాణ మార్గం సుగమం చేసుకోవాలని,పోలీసువారికి సహకరించాలని కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ తెలిపారు.
Comments
Post a Comment