చెన్నూర్,ఎస్ బిఐ బ్యాంక్ 402గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు అపహరణ...బంగారం 25.17కిలోలు,విలువ రూ.12.61 కోట్లు,నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగం...
చెన్నూర్,ఎస్ బిఐ బ్యాంక్ 402గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు అపహరణబంగారం,25.17కిలోలు,విలువ రూ.12.61 కోట్లు,నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగంబ్యాంక్ లో చోరీ కేసులో 47మంది నిందితులు అరెస్ట్ఇందులో ముగ్గురు బ్యాంక్ అధికారులే15.237 కిలోల నగలు,రూ.1,61,730 నగదు స్వాధీనంరామగుండం పోలీస్ కమీషనరేట్
2025,ఆగస్ట్,23వ తేదీన,రితేష్ కుమార్ గుప్తా,రీజినల్ మేనేజర్,ఎస్బీఐ చెన్నూర్ పీఎస్ చెన్నూర్‌లో ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు ప్రకారం బ్యాంకులో 402గోల్డ్ లోన్ ఖా తాల ఆభరణాలు (25.17 కిలోల బంగారం) విలువ రూ.12.61 కోట్లు మరియు నగదు రూ.1.10కోట్లు దుర్వినియోగం చేయబడి,దొంగిలించబడ్డాయి.ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్,ఏ.భాస్కర్,డీసీపీ మంచిర్యాల్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను ఏ.వెంకటేశ్వర్, ఏసీపీ జై పూర్‌కు అప్పగించారు.దర్యాప్తు అధికారి,ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేసి,సాం కేతిక ఆధారాలను సేకరించి,క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో ఆడిట్ నిర్వహించగా భారీగా అనుమానాస్పద డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.ప్రధాన నిందితుడు నరిగె రవీందర్ (క్యాషియర్)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా,ఆయన చెప్పిన ప్రకారం అక్టోబర్ 20 24కు ముందే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నాడు.తన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం,మరింత బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి మోసానికి పాల్పడ్డాడు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ యొక్క తాళం మేనేజర్,క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండేది. మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్‌కు ఇచ్చినాడు.దాన్ని ఉపయోగిం చుకుని,నరిగె రవీందర్, క్యాషియర్,మేనేజర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో బం గారం,నగదు దొంగిలించేందుకు పథకం రచించాడు.అక్టోబర్,2024 నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి,తన స్నేహితులు–కొంగోండి బీరష్ (సేల్స్ మేనేజర్,ఎస్ బిఎఫ్ సి మంచిర్యాల),కొడాటి రాజశేఖర్ (కస్టమర్ రిలేషన్ మేనేజర్,ఎస్ బిఎఫ్ సి మంచిర్యాల),బొల్లి కిషన్ (సేల్స్ ఆఫీసర్, ఎస్ బిఎఫ్ సి మంచిర్యాల్)కు అప్ప గించేవాడు.వీరు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి, డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి, కొంత కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్‌కి బదిలీ చేసేవారు.ఇప్పటివరకు నిందితులు 10ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో (SBF C,Indel Money,Muthoot Finance Ltd.,Godavari Urban,Man appuram,Muthoot Fincorp, Muthoot Mini) 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు.అలాగే,క్యాషియర్ నరిగె రవీందర్ బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై తన భార్య,మరిది మరియు స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్ లోన్లు 42మంజూరు చేసి, బంగారం లేకుండానే రూ.1.58కోట్లు (అంటే 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించారు) విత్‌డ్రా చేసుకున్నాడు. అంటే వాస్తవ నష్టం 21కిలోల బంగారం విలువ ఉంటుంది అన్నారు.అలాగే క్యాషియర్ రవీందర్,ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమ యంలో కూడా డబ్బు అపహరించేవాడు.దర్యాప్తు అధికారి ఇప్పటివరకు మూడు బ్యాంకు అధికారులు మరియు వారికి తోడ్పడిన 41మందితో కలిపి మొత్తం 47 నిందితులను అరె స్టు చేశారు.ఈ కేసులో ఇప్పటివరకు SBFC,Indel Money,Godavari Urban,Muthoot Mini మరియు IIFL నుంచి 15.23కిలోల బంగారు నగలు రి కవరీ అయినాయి.మిగతా బంగారు ఆభరణాలు Muthoot Finance Ltd.,M anappuram Mancherial,Muthoot Fincorp, Muthoot Fin Che nnur మరియు Muthoot Mini Chennurలో నుంచి రికవరీ చేయబడవలసి ఉంది.గోల్డ్ లోన్ కంపెనీ మేనేజర్ ల పాత్రపై విచారణ జరుగుతుంది.ఈ కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించినందుకు ఏ.భాస్కర్,ఐపీఎస్ డీసీపీ మంచిర్యాల్,ఏ. వెంకటేశ్వర్ ఏసీపీ జైపూర్,దేవేందర్ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నూర్,ఆర్.బన్సీలా ల్ సీఐ చెన్నూర్ రూరల్, డి.వేను చందర్ సీఐ శ్రీరాం పూర్,ఏ.ఆశోక్ సీఐ మంచిర్యాల్ రూరల్,కె.నరేష్ కుమార్ ఇన్స్పెక్టర్ WPS, బాబురావు ఇన్స్పెక్టర్ CCS,ఎస్‌ఐలు పి.సు బ్బారావు,శ్రీధర్,రాజేందర్,శ్వేత,సంతోష్,లక్ష్మీప్రసన్న,కోటేశ్వర్,ఉపేందర్ రావు,చంద్ర శే ఖర్,రవి,హెడ్ కానిస్టేబుళ్లు శంకర్,రవి,పీసీలు రమేష్,ప్రతాప్,తిరుపతి,లింగమూర్తిలను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు.
నిందితుల వివరాలు :
A1. నరిగె రవీంధర్,(32),ఎస్ బిఐ-02 బ్రాంచ్‌లో క్యాషియర్ చెన్నూర్,జైపూర్ మండ లం,షెట్పెల్లి గ్రామం.
A2. వెన్నపురెడ్డి మనోహర్,(34),బ్రాంచ్ మేనేజర్,ఎస్ బిఐ బ్రాంచ్-02,చెన్నూర్,ము త్తరావుపల్లి గ్రామం.
A3. లక్కాకుల సందీప్,(28),అటెండర్,ఎస్ బిఐ-02 బ్రాంచ్ చెన్నూర్‌లో అవుట్‌సో ర్సింగ్ ఉద్యోగి,గోదావరి రోడ్డు,చెన్నూర్.
A4. కొంగొండి బీరేష్,(28),సేల్స్ మేనేజర్,ఎస్ బిఎఫ్ సి మంచిర్యాల్,జైపూర్ మండ లం,షెట్పెల్లి గ్రామం.
A5. కోదాటి రాజశేఖర్,(30),కస్టమర్ రిలేషన్ మేనేజర్,ఎస్ బిఎఫ్ సి గోల్డ్ లోన్ ఫైనా న్స్,మంచిర్యాల,రామకృష్ణాపూర్.
A6. బొల్లి కిషన్ కుమార్,(30),ఎస్ బిఎఫ్ సి,మంచిర్యాలలో occ సేల్స్ ఆఫీసర్,బి-జో న్,రామకృష్ణపూర్.
A7. ఉమ్మాల సురేష్,(23),ఫోటోగ్రాఫర్,శెట్పెల్లి గ్రామం,జైపూర్ మండలం.
A8. నడిగొట్టు సాగర్,(29),ప్లంబింగ్ పని,రోడ్ నెం-3,రాళ్లపేట్,మంచిర్యాల.
A9. రాంశెట్టి చంద్రబాబు,(32) ప్రైవేట్ ఉద్యోగి,శాంతినగర్ కాలనీ,రామకృష్ణ పూర్.
A10. భరతపు రాకేష్,(29),ప్రైవేట్ ఉద్యోగి (ప్రైవేట్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్),శాంతి నగర్ కాలనీ,రామకృష్ణ పూర్.
A11. దిగుట్ల సునీల్ (22),సెంట్రింగ్ పని, లక్ష్మీనగర్,మంచిర్యాల.
A12. కడం రమేష్,(36),రామకృష్ణా పూర్ గ్రామం.
A13.దారపు నాగరాజు (30),ప్రైవేట్ ఉద్యోగి,బృందావన్ కాలనీ,మంచిర్యాల.
A14. నిట్టూరి రాజు (23),కార్ డ్రైవర్,నారాయణపూర్ గ్రామం,చెన్నూరు మండలం,ప్ర స్తుతం బగత్ సింగ్ నగర్, రామకృష్ణాపూర్.
A15. కంబాల మహేష్ (25),ప్రైవేట్ ఉద్యోగి,దహెగావ్ మండలం ఐనం గ్రామం.కెబిఎం ఆసిఫాబాద్.
A16. కంది మల్లేష్ (40),ప్రైవేట్ ఉద్యోగి (గోదావరి అర్బన్ బ్యాంక్ అధికారి),ఎడ్లవాడ, కాలేజ్ రోడ్,మంచిర్యాల.
A17. జూపాక సత్యనారాయణ (31), ప్రైవేట్ ఉద్యోగి(IIFL, MNCL),శాంతినగర్ కాలనీ,రామకృష్ణపూర్.
A18. దయ్యాల మహేందర్ (28), జైపూర్ మండలం,కుందారం గ్రామం.
A19. ఉరుగుండ పరంధాములు (50), SBFC, MNCL,సెక్యూరిటీ గార్డు, మంద మర్రి.
A20. కుమ్మరి నగేష్ (25),సెంటరింగ్ పని,హైటెక్ సిటీ కాలనీ,మంచిర్యాల,సిరోంచ తహశీల్ లక్ష్మీపూర్ గ్రామం, గడ్చిరోలి జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం.
A21. మహ్మద్ రషీద్ (38),ప్రైవేట్ ఉద్యోగి (గోదావరి అర్బన్ బ్యాంక్,MNCL వద్ద క్ల ర్క్),బృందావన్ కాలనీ,చున్నంబట్టి,మంచిర్యాల, జమ్మికుంట గ్రామం,మండలం,కరీం నగర్ జిల్లా.
A22. దాడి రాజ్‌కుమార్ (35),ప్రైవేట్ ఉద్యోగి,IIFL హౌసింగ్ లోన్ విభాగం,శాంతి నగర్,రామకృష్ణాపూర్.
A23. కన్నం రాకేష్ (26),ఫ్యూజన్ ఫైనాన్స్,మంచిర్యాలలో రిలేషన్ ఆఫీసర్,పెద్దపల్లి జి ల్లా,పాలకుర్తి మండలం, కన్నాల గ్రామం,ప్రస్తుతం రెడ్డి కాలనీ, మంచిర్యాల.
A24. నేరడిగొండ అనిల్ సాయి (27),సిమెంట్ షాపు వ్యాపారం,నర్సింగాపూర్ గ్రా మం,జైపూర్ మండలం.
A25. దుర్కి ప్రవీణ్ కుమార్ (25), జైయూర్ మండలం శెపెల్లి గ్రామం.
A26. బొడ్డుపల్లి ప్రశాంత్ (28),ప్రైవేట్ ఉద్యోగి (శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్,MNCL),గ ర్మిల్లా,మంచిర్యాల.
A27. మంతెన రాజశేఖర్ (32),ప్రైవేట్ ఉద్యోగి (పైలట్ సేల్స్ ప్రతినిధి,కెబిఎం జిల్లా వి భాగం ఐటిసి),జైపూర్ మండలం,పౌనూర్ గ్రామం.
A28. కొమ్ము మహేష్ (26),శెట్పెల్లి గ్రామం,జైపూర్ మండలం.
A29. పంచల శశిధర్ (35),రాళ్లపేట్, మంచిర్యాల.
A30. దుర్గం మనోహర్ (29),భీమారం మండలం,బూరుగుపల్లి గ్రామం.
A31. జాకవర్ మహేష్ (30), మేదరివాడ,మోబిన్‌పేట్ గ్రామం సిరోంచ తహసైల్,గడ్చి రోలి జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం.
A32. మహమ్మద్ హబీబ్ పాషా (32), కూలీ,గంగా కాలనీ,రామకృష్ణాపూర్.
A33. జంగంపల్లి యుంగేందర్,(40), సంవత్సరాలు,ప్రైవేట్ ఉద్యోగి,చున్నంబట్టి వాడ, మంచిర్యాల.
A34. మహమ్మద్ సమీరుద్దీన్ (35), ఇండెల్ మనీ ఫైనాన్స్‌లో ట్రైనీ CRE,ఇక్బాల్ అ హ్మద్ నగర్,మంచిర్యాల.
A35. మోతుకూరి శ్రీనివాస్ (27),ప్రైవేట్ ఉద్యోగి (మణప్పురం గోల్డ్ లోన్, MNCL), గణేష్ నగర్,చున్నంబట్టి,మంచిర్యాల.పుట్టపాక గ్రామం,మంథని మండలం,పెద్దపల్లి జిల్లా.
A36. తాళ్లండి అనాజయ్య,(35), ఎలక్ట్రికల్ వర్క్,ST వాడ,కొత్తూరు గ్రామం,నెన్నెల్ మండలం.
A37. నిమ్మతి సుమ (36),గృహిణి, వినాయక నగర్,రైసింగ్ సన్ స్కూల్ సమీపం,చు న్నంబట్టి వాడ,మంచిర్యాల, (పరారీలో ఉన్నారు).
A38. పాణి రవళిఖా (28),గృహిణి, రామకృష్ణాపూర్.
A39. ఈసంపల్లి సాయికిరణ్ (26), ఫోటోగ్రాఫర్,శెట్పెల్లి గ్రామం,జైపూర్ మండలం.
A40. నరిగె స్వర్ణలత (26),గృహిణి, షెట్పెల్లి గ్రామం,జైపూర్ మండలం.
A41. గౌడ సుమన్ (28),ప్రైవేట్ ఉద్యోగి,Unique Biotech Ltd,కొల్లూరు,శెట్పె ల్లి గ్రామం,జైపుడ్ మండలం, ప్రస్తుతం రాంరెడ్డి నగర్,చింతల్, హైదరాబాద్.
A42. తుండ్ల సురేష్ (33),ప్రైవేట్ ఉద్యోగం,ఖమాన్పూర్ గ్రామం,పెద్దపల్లి.
A43. జుర్రు శ్రీనివాస్ (33),పాల వ్యాపారం,సీతారాంపల్లి గ్రామం,నస్పూర్ మండలం.
A44. తుంగపిండి శేఖర్ పరారీలో ఉన్నాడు.
A45. నరిగె సరిత (35),వ్యవసాయం,శెట్పెల్లి గ్రామం,జైపూర్ మండలం.
A46. మోతుకూరి రమ్య (31),శెట్పెల్లి గ్రామం.
A47. అగిడి మొగిలి (49),మెకానిక్,రామకృష్ణపూర్.
Comments
Post a Comment