ఇదే స్పూర్తితో 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి... విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...
జిల్లాలో మూడవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలు
ప్రశాంతంగా కొనసాగేలా భద్రతా చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు
ఇదే స్పూర్తిని 5వ రోజు,9వ రోజు జరిగే నిమజ్జన ఉత్సవాలలో కొనసాగించాలి
విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,757 విగ్రహాలు (ఆయా సబ్ డివిజన్ లలో కర్నూలు 612,ఆదోని 143,ఎమ్మిగనూరు 832,పత్తికొండ 1170) నిమజ్జనం జరిగే ప్రాంతాలలో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించామన్నారు.నిమజ్జనం ప్రాంతాలకు చిన్నపిల్లలు,వృద్దులను దూరంగా ఉంచే విధంగా గణేష్ ఉత్సవ నిర్వహకులు చర్యలు తీసుకోవాలన్నారు.వినాయక మండపాలలలో,వినాయక విగ్రహాలు తరలించే సమయంలో వర్షం కురిస్తే విద్యుత్తు తీగల దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.నిమజ్జనం ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని నిర్వాహకులకు సూచించారు.ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించి,శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే స్థానిక పోలీసుస్టేషన్ లో గాని డయల్ 100 లేదా డయల్ 112నెంబర్ కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.
Comments
Post a Comment