కామంతో కళ్లుమూసుకుపోయి..మైనర్ పై అఘాయిత్యం...పోక్సో కోర్టు సంచలన తీర్పు...51ఏళ్ళు జైలు శిక్ష...
కామంతో కళ్లుమూసుకుపోయి..మైనర్ పై అఘాయిత్యంపోక్సో కోర్టు సంచలన తీర్పు51ఏళ్ళు జైలు శిక్ష
మానవత్వం మరిచిన కామాంధులు ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక దాడులకు పా ల్పడుతున్నారు.మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి,హత్య చేసిన కేసులో నింది తుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం మైనర్ బాలికపై అ త్యాచారానికి పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ఖయ్యూంకు 51ఏళ్ళు జైలుశిక్ష విధిం చింది కోర్టు...వివరాలు ఇలా ఉన్నాయి...నల్లగొండ జిల్లా,తిప్పర్తి మోడల్ స్కూల్లో ఓ మై నర్ బాలిక పదవ తరగతి చదువుతోంది.తిప్పర్తికి చెందిన మమ్మద్ ఖయ్యూం...ప్రేమ పే రుతో బాలికను వేధింపులకు గురి చేశాడు.2021,నవంబర్,3వ తేదీన బస్ స్టాప్ వద్ద ఉ న్న మైనర్ అమ్మాయిని షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పాడు బడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో 2021,డిసెంబర్,5వ తేదీన వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఖయ్యూంపై నమోదు చేశా రు.2022 నుండి పోక్సో కోర్టులో వాదనలు కొనసాగాయి.ఈ కేసులో ప్రాసిక్యూషన్ తర పున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.దీంతో నిందితుడికి 51ఏళ్ల శిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.నింది తుడికి అత్యాచార కేసులో 20 ఏళ్లు,పోక్సో కేసులో 20 ఏళ్లు,ఎస్సీ,ఎస్టీ, కేసులో పదే ళ్ళు,సెక్షన్ 506 (మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.మొత్తం 51ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.8,500 రూపాయల జరిమానాను పోక్సో కోర్టు ఇంచార్జ్ న్యాయమూర్తి రోజా రమణి విధించారు.బాధితురాలికి ఏడు లక్ష లు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పులో ప్రకటించింది.న్యాయస్థానానికి సరైన సైంటి ఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో...శిక్ష నుంచి నిందితుడు తప్పించుకోలేక పోయాడని పోలీసులు చెబుతున్నారు.
Comments
Post a Comment