సొంత ఇంట్లోనే ప్రమాదం పెరుగుతోంది...మీరు ప్రేమలో పడ్డారా...??...మీ తల్లి,తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటు న్నారా...??...
సొంత ఇంట్లోనే ప్రమాదం పెరుగుతోందిమీరు ప్రేమలో పడ్డారా...??మీ తల్లి,తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా...??లవ్ అనే ఆకర్షణలో పడి కొట్టుమిట్టాడుతున్నారా..??జీవితం కన్నా నాకు లవరే ముద్దు అనుకుంటున్నారా...?అయితే మీ బ్రతుకు మధ్యంతర ఎన్నికల టైపే..!
కన్నతల్లి తండ్రులు,గ్రామం,సమాజం,మీ స్నేహితులు బంధువులు మిమ్మల్ని చిదరించుకుం టారు ఇది మీకు కావాలా...!?తల్లి తండ్రులు బంధువులు చూసిన సంబంధంనే ఒప్పుకు ని పెళ్లి చేసుకొని జీవితాంతం హాయిగా,చక్కగా భార్యా పిల్లలు తల్లితండ్రులతో సుఖంగా ఉండాలని కోరుకోండి.మీ చుట్టూ సమాజాన్ని ఒక్కసారి చూడండి,లవ్ ఫెయిల్ వల్ల కొం పలు కూలిపోవడం,మన చుట్టూ జరుగుతున్న జీవిత సమాజంలో ప్రదర్శించబడుతుం ది.దీంతో బంధువులు రక్తసంబంధాలు మానవత్వాలు అన్న తమ్ముళ్లు,అక్కచెల్లెళ్లు,బావ మరదలు ఈ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి మీ ప్రేమ లవ్ వల్లనే అని గ్రహించం డి.ప్రేయసి ప్రియుడి మధ్య మొదలయ్యే "లవ్ స్టోరీస్" మన సమాజంలో కొత్తేమీ కావు. కానీ ఇప్పుడు ఇవి తాత్కాలిక ఎన్నికల్లా మారిపోయాయి.మధ్యంతర ఎన్నికలప్పుడు ప్రజ లు ఉత్సాహంగా,హడావుడిగా ఓటు వేసి తర్వాత ఫలితాలు ఎలా ఉన్నా పక్కనబెట్టినట్లే, చాలా మంది యువతలో ఇప్పుడు ప్రేమ కూడా ఒక తాత్కాలిక మోజు,కేవలం భావోద్వే గం క్షణికావేశం మాత్రమే అయిపోయింది.తల్లిదండ్రుల అనుమతి లేకుండా,కుటుంబం వ్య తిరేకించినా,తాము తీసుకున్న నిర్ణయాలే గొప్పవి అని భావించి కొందరు ప్రేమపెళ్లిళ్లు చే సుకుంటున్నారు.మొదట్లో స్వర్గం అనిపించిన ఆ బంధం,కొద్దిరోజులకే నరకంలా అనిపిం చడం తరచుగా మనం చూస్తున్న వాస్తవం.అనుకోని ఇబ్బందులు,ఆర్థిక సమస్యలు,ఆత్మ గౌరవం,విలువలు ఇవి కలిసి ప్రేమ అనే తీయని కలను చేదుగా మార్చేస్తున్నాయి.అందువ ల్లే కొంతమంది విడాకులు తీసుకోవడం,కొంతమంది రోడ్డుపై పడిపోవడం,మరికొందరు ఆక్రోశంతో ఘోర హత్యలు,ఆత్మహత్యలకు పాల్పడడం మన కంటికి కడుపుకు మంట కలి గించే సామాజిక సమస్యగా మారింది.ఈ పరిస్థితిని ప్రేమ ఒక స్థిర నిర్ణయం కాదు,అది క్ష ణిక భావోద్వేగపు మధ్యంతర ఎన్నిక అనే పోలికతో చూడాల్సిన అవసరం ఉంది.
యువతకు సందేశం :
ప్రేమలో పడటం తప్పు కాదు.ప్రేమ జీవనానికి ఆనందం ఇస్తుంది.కానీ ఆ ప్రేమను కేవలం భావోద్వేగంతో కాక,బాధ్యతతోనూ ఆలోచించాలి.ప్రేమ అనేది కేవలం ఆకర్షణ కాదు,ఒ కరికొకరు అర్థం చేసుకోవడం,గౌరవించడం,పెళ్లి కేవలం ఇద్దరి నిర్ణయం కాదు.రెండు కు టుంబాల భవిష్యత్తు,ఆర్థిక స్థిరత్వం,జీవన విలువలు,ఒకరి మనసు మరొకరు భరించే స హనం లేకపోతే ఆ బంధం నిలవడం కష్టం.ప్రస్తుతం ఈ సమాజంలో నిమిషానికి ఒక్క అ దే ప్రేమ జంటల కథలు కథలుగా బయటికి వస్తున్నాయి. తల్లి తండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడం లేచిపోవడం కొన్నాళ్లకు వారికి సమస్యలు రావడం గొడవలు జరగడం క్షణి కావేషాల వల్ల అఘాయిత్యాలకు పాల్పడడం జరుగుతున్న తరుణం నిత్యం మనం చూస్తూ నే ఉన్నాం.నేడు దాపురించిన ఈ సమస్య గ్రామస్థాయి నుండి లవ్ కేసులు లేచి పోవడా లు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోడాలు,దీంతో కన్నతల్లి తండ్రులు గ్రామాల్లో తలెత్తుకో లే ని పరిస్థితి తీసుకొస్తున్నారు కన్నా కొడుకులు,బిడ్డలు కొందరు.ఇలాంటి లవ్ కేసుల్లో 99 శాతం కలిసి ఉన్న దాకాలాలు కనిపించడం లేదు.ఎక్కడికి వెళ్లినా ఏ పోలీస్ స్టేషన్ వెళ్లి నా ఏ గ్రామపంచాయతీకి వెళ్లినా ఏ గ్రామంలోకి తొంగి చూసినా ఇలాంటి కేసిలే అధికం గా కనిపిస్తున్నాయి.కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కొందరు త ల్లి తండ్రులు తన కూతురు లేచిపోయింది అని తెలిసి మా అమ్మాయి లేదా అబ్బాయి చచ్చి పోయారని ఫ్లెక్సీలు ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
సమాజానికి పాఠం :
ప్రేమ పెళ్లిళ్లను అడ్డగించడం మాత్రమే పరిష్కారం కాదు.పెద్దలు కూడా వినాలి.తమ పిల్లల భావాలను గౌరవంగా పరిగణించాలి.అదే సమయంలో పిల్లలు కూడా పెద్దల అనుభవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.లవ్ అనేది ఒక మధ్యంతర ఎన్నిక కాదు.అది జీవితాంతం ఇచ్చిన ఓ వాగ్దానం.కాబట్టి మనసు మోజు తీరిపోయిన తర్వాత పశ్చాత్తాపం కాకుండా,మనం తీ సుకునే నిర్ణయాలను బాధ్యతతో తీసుకోవడం మేలని ప్రతీ యువజనుడు గ్రహించాలి.
ప్రేమ పెళ్లిళ్ల బ్రతుకులు,ఆర్థిక సంవత్సరానికి విశ్లేషణ :
దేశంలో 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి బ్రతుకుల్లో సవాళ్లు పెరిగాయి.సమస్యలు కూడా తీవ్రంగా వెలుగులోకి వచ్చాయి.పెళ్లికి ముందు స్వేఛ్చ,ప్రేమ,ఆ కర్షణ ప్రధానంగా కనిపించినా పెళ్లి తర్వాత అనూహ్యమైన ఇబ్బందులు,విభేదాలు,మోసా లు,క్రైమ్‌లు నేటి ప్రేమ పెళ్లిళ్ల జీవితాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.దేశంలో ప్రేమపెళ్లిళ్లు మొత్తం వివాహాల్లో 10-15శాతం వరకు ఉండి,ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతు న్నాయి.
ప్రేమపెళ్లిళ్లలో తొలిదైన రోజుల్లో భావోద్వేగం,ఆనందం,స్వేచ్ఛ కనిపిస్తుంది.కానీ కు టుంబం,ఆర్థిక పరిస్థితి, ఒత్తిడులు,సర్వసాధారణ విలువలు, సమాజ ఒత్తిడి కారణంగా కా లక్రమేణా విభేదాలు,దూరం,విడాకులు తప్పనిసరి అవుతున్నారు.ప్రేమపెళ్లిళ్లలో విడాకులు 20-30శాతం వరకు నమోదవుతున్నాయి.ఇది దేశంలో జరగుతున్న ప్రేమ పెళ్లిళ్ల స్వధ ర్మంలో పెరుగుతున్న విభేధానికి సంకేతం.
ప్రేమ అసంబద్ధ,క్రైమ్‌లు ఎందుకు పెరుగుతున్నాయి :
2025లో క్రైమ్ రేట్స్‌లో పెరుగుదల కనిపిస్తోంది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCR B) ప్రకారం,ప్రేమ సంబంధాల వల్ల,వివాహ బంధాల వల్ల జరిగే హత్యలు దేశంలో మూడ వ,నాలుగవ స్థానాల్లో ఉంటున్నాయి.మొన్నటి కాలంలో భార్యలు,భర్తలు,వారి ప్రియులు క లిసి ప్లాన్ చేసి హత్యలకు పాల్పడే ఘటనలు పెరిగాయి.ఒకరి నిర్వాకం,మోసం,కుటుం బం తేలిపోవడం, భావోద్వేగం,మానసిక ఒత్తిడి,పాత దాక్షిణ్యం పోవడం,నమ్మకమే మారి పోవడం వంటి కారణాలు కారణమంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రు లు,సమాజం,కుటుంబాల మద్దతు లేకపోవడం కూడా ఈ లవ్ మ్యారేజ్ కుటుంబ కలహా లకు కారణంగా నిలుస్తోంది.
మానవ కుటుంబ స్వేఛ్చ,విరోధం వల్ల సంబంధాలు బలహీనపడుతున్నాయి.ఆర్థిక స్థిరత్వం లేకపోవడం పెళ్లి తర్వాత పిల్లలు,కుటుంబ బాధ్యతలు,ఆర్థిక సమస్యలు తీవ్రంగా మారా యి.ఇన్‌ఫిడెలిటీ,మోసం ప్రియులు,భార్య/భర్త ఎటు తిప్పుకుంటున్నారో తెలియక విశ్వా సం కోల్పోయిపోతుంది.మనో బలక్షయం,మానసిక సమస్యలు,సమస్యలు డీల్ చేయ డానికి మద్దతు,కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల మానసిక సమస్యలు,ఆత్మహత్యలు ఎక్కువ శాతం జరుగుతున్నాయి.
సమాజానికి సందేశం :
ప్రేమ మీద ఆధారపడి తీసుకునే నిర్ణయాల్లో బాధ్యత,సహనం,ఆర్థిక ప్రణాళిక,కుటుంబ వి లువలు కూడా పాటించాలి.కుటుంబ సభ్యులు,తల్లిదండ్రులు తలకు మద్దతుగా నిలిచి మా ర్గనిర్దేశం చేయాలి.మానసిక,భావోద్వేగ సమస్యలను చక్కగా తేల్చడానికి సామాజిక ప్రక్రి యలు పెరగాలి.ఈ అంశం ఆధారంగా భారత సమాజంలో ప్రేమపెళ్లిళ్లు సవాళ్లు,విభేదా లు,క్రైమ్‌ల పెరుగుదల,సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించాలి, ప్రేమ పెళ్లి వద్ద బాధ్యతతో నిర్ణయం తీసుకుని,కుటుంబం,సమాజం అనుసంధానం కలిగించాలి.లేకపో తే మరణాలు,హత్యలు,ఒత్తిడి పెరుగుతూనే ఉంటాయి.
2024-25 ప్రేమ హత్యల రాష్ట్రాల గణాంకాలు :
2024-25లో ప్రేమ హత్యలపై అధికారికంగా పూర్తి రాష్ట్రాల గణాంకాలు ఈ విధంగా ఉ న్నాయి.తాజా ఆధారాల ప్రకారం కొన్ని రాష్ట్రాల సమాచారం,ప్రేమ పెళ్లిళ్లు సంబంధాలకు సంబంధమైన హత్యలు తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణ భారతంలో ఎక్కువ నమోదయ్యా యి.
రాష్ట్రాల వారీగా ప్రేమ హత్యలు,ఆత్మహత్యలు (2022–2024)
తాత్కాలిక గణాంకాలు :
రాష్ట్రం ప్రతివర్షం సగటు హత్యలు, ఆత్మహత్యలు ప్రకారంగా సిక్కిం 37.5 అత్యధికం,ఛ త్తీస్ ఘడ్ 26.42, కేరళ25.44,తెలంగాణ 23.3, తమిళనాడు 21.8 ఈ రాష్ట్రాల్లో ప్రే మ విభేదాలు,సూచిక బాధ్యతలు వల్ల ఎక్కువ మంది బలవన్మరణాలు హత్యలు జరుగుతు న్నాయి.తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ,ఆంధ్ర తాజా సంవత్సరాల్లో ప్రేమ వివాహాల కారణం గా ఒత్తిడులు,ఇంటర్మీడియట్ విద్యార్థులు, యువతలో ఆత్మహత్యలు ఎక్కువగా వెలుగులో కి వస్తున్నాయి.కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ,పుదుచ్చేరి,అండమాన్,నికోబార్‌లలో ఆత్మ హత్యల రేటు అత్యధికంగా ఉంది.లక్షద్వీప్ అత్యల్పంగా ఉంది.
అంశాల విశ్లేషణ :
దక్షిణాది రాష్ట్రాలు,ప్రేమ ఆత్మహత్యల సమస్యలో ముందు వరుసలో ఉన్నాయి.కుటుంబ స మస్యలు,నిరుద్యోగం,ప్రేమ విఫలం పెరగడానికి ప్రధాన కారణాలు.తెలుగు రాష్ట్రాల్లో తల్లి దండ్రుల,సమాజ ఒత్తిడి కూడ బ్రతుకుల్లో విభేదాలకు దారితీస్తోంది.
2024-25 ప్రేమ-సంబంధిత హత్యల గణాంకాలు :
ప్రతిఏటా భారతదేశంలో 275మంది భర్తలు భార్యల చేత హత్యకు గురవుతున్నారు.అ లాగే 225మంది భార్యలను భర్తలు హత్య చేస్తున్నారు.2022 NCRB ప్రకారం,మొ త్తం దేశంలో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి.వీటిలో ప్రేమ సంబంధాలు,వివా హ సంబంధాలు మూడవ,నాలుగవ ప్రధాన కారణాలుగా కనిపించాయి.2,821 హత్యలు ప్రేమ,వివాహ విభేధాలు,సంబంధాల కోల్పోయిన విషాదాల వల్ల జరిగాయి,అంటే దేశం లో జరిగే ప్రతి 10హత్యల్లో ఒకటి ప్రేమ లేదా సంబంధాలమీద జరుగుతోందని అర్థం.సో షల్ మీడియా వాడకం పెరగటం,న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ వల్ల ఈ విభేదాలు తీవ్రంగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇతర ఆధారాలు,పరిణామాలు :
2024 అనధికారికంగా గణాంకాల సమాచారం మేరకు,2022తో పోలిస్తే 2024-25 లో ప్రేమ హత్యలు పెరుగుతూనే ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం.వివాహ బంధాల్లో మోసం,అధిక ఆర్థిక,మానసిక ఒత్తిడి వల్లే హత్యలు,ఆత్మహత్యలు పెరిగాయి.ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీలలో 1,000మందిలో 29భర్తలు,32భార్యలు హింసకు గురవుతు న్నారు.అంటే సొంత ఇంట్లోనే ప్రమాదం పెరుగుతోంది అని విశ్లేషకుల అభిప్రాయం వ్య క్తం అవుతోంది.
కారణాలపై నిపుణుల విశ్లేషణ :
నమ్మకం కొరత ప్రియుల మధ్య నమ్మకానికి దెబ్బ తగిలితే భారీ కలతలు ఏర్పడుతున్నా యి.ఆర్థిక,మానసిక ఒత్తిడి మధ్య తరగతి,మహిళలు,ఉద్యోగులు వీరందరిలో పొత్తులు,వి భేదాలు మనస్పర్ధలు ఎక్కువవుతున్నాయి.బహిరంగ సంబంధాల వల్ల మోసం అభద్రత ఎ గతాళి,అదుపుతప్పిన సంబంధాలు హత్యలకు దారితీసే ప్రభావవంతమైన అంశంగా మా రాయి.2024-25లో దేశవ్యాప్తంగా ప్రేమ,సంబంధాల్లో హత్యలు పెరుగుతూ,ప్రతి పది లో ఒక హత్య సంబంధపు విభేదాలు ప్రేమ ద్రోహానికి గురవుతోంది.కుటుంబ సమరసం, సంబంధాల్లో నమ్మకం,సహనం,మానసిక ఆరోగ్యం కోసం సామాజిక మార్గనిర్దేశం అవస రం.ఏది ఏమైనా గానీ ప్రతి తల్లి,తండ్రి తన కొడుకులను బిడ్డలను కని గారాబంగా పెంచి వారి కోసమే అహర్నిశలు కష్టపడుతున్న తరుణంలో బిడ్డలకు రెక్కలు వచ్చి ప్రేమ పేరుతో ఎగిరిపోవడానికి ఆ కుటుంబాలు బాధాప్తా హృదయంలో అడుగంటి పోతున్నాయి.పిల్ల ల్లారా...మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి.మీ మీద ఎంతో ఆశతో తల్లితండ్రులు పెంచి పెద్ద చేసి,మీ కోసమే ఒకపూట తిని తినక కష్టపడుతున్నారు.వారి కలలను నిజం చేయండి...కల్లోలం చేయకండి అని ప్రేమతో పాత్రికేయ సమాజం సూచిస్తుంది.
Comments
Post a Comment