ఆశీర్వాదం తీసుకున్న చేతులతో...నానమ్మ మృతిపై ఐకాన్ స్టార్ భావోద్వేగం...

ఆశీర్వాదం తీసుకున్న చేతులతో...నానమ్మ మృతిపై 

ఐకాన్ స్టార్ భావోద్వేగం

VS9TV న్యూస్,హైదరాబాద్ :
అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.అల్లు అరవింద్‌ తల్లి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు.శుక్రవా రం అర్థరాత్రి 1:45 గంటలకు వృద్ధాప్య కారణాలతో ఆమె తుదిశ్వాస విడిచారు.శనివా రం మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.అల్లు కనకరత్నమ్మ మృతి వార్తతో అల్లు,కొణిదెల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.మెగా స్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు కనకరత్నమ్మ తల్లి కావడంతో చిరంజీవి కుటుంబానికి ఇది తీరని లోటు.ఈ సందర్భంగా చిరంజీవి తన బాధను వ్యక్తం చేస్తూ X (గతంలో ట్విట్ట ర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు."మా అత్తయ్య కీ.శే అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రే మ,ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఓం శాంతిః" అని పేర్కొన్నారు.నానమ్మ కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.
నానమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు.ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చే సుకుని భావోద్వేగానికి గురయ్యారు. గతంలో, 'పుష్ప' సినిమా షూటింగ్‌ పూర్తయిన త ర్వాత జైలు సన్నివేశం నుంచి బయటపడిన ప్పుడు,అల్లు అర్జున్‌కు నానమ్మే స్వయంగా దిష్టి తీశారు.ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు...అ టు రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.అమ్మమ్మ పార్థివ దే హానికి నివాళుల్పించారు.అంత్యక్రియల ఏర్పాట్లను అల్లు అరవింద్‌, చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు.త్రివిక్రమ్,ఘట్టమనేని శేషగిరిరావు,పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లె జినోవా,మురళిమోహన్,నాగచైతన్య,వరుణ్ తేజ్,సాయిధరమ్ తేజ్,బన్నీ వాసు,దగ్గుబా టి వెంకటేష్,జీజీవిత రాజశేఖర్, శ్యామలా దేవి,వంటి పలువురు సినీ ప్రముఖులు అల్లు కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సాను భూతిని తెలిపారు.ఆమె మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు నింపింది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....