భూపాలపల్లిలో దారుణం...క్షుద్రపూజలకు యువతి బలి...

భూపాలపల్లిలో దారుణం...క్షుద్రపూజలకు యువతి బలి

VS9TV న్యూస్,జయశంకర్‌ భూపాలపల్లి :
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.గుర్తు తెలియని వ్య క్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది.జాతీయ రహదారి కాటారం-భూపాలపల్లి మా ర్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపో యిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.యువతిని జిల్లాలోని చిట్యాల మండ లం,ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు.ఘటనా స్థలంలో నిమ్మకాయలు,ప సుపు,కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చారనే ఆరోపణలు వినప డుతున్నాయి.ఈ నెల 6న చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో వర్షిణి కనిపించడం లేదంటూ మి స్సింగ్ కేసు నమోదైంది.మృతదేహం పక్కన ఆధార్‌ కార్డు లభించడంతో దాని ఆధారంగా వర్షిణిగా గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మెడిపల్లి అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో యువతి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వారి సమాచారంతో కాటారం డీఎస్పీ సూ ర్య నారాయణ,సీఐ నాగార్జునరావు,ఎస్సై శ్రీనివాస్‌ వెళ్లి ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించి వివరాలు సేకరించారు.మృతదేహం పక్కనే యువతి ఆధార్‌ కార్డు,కుంకుమ,ని మ్మకాయలు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.వాటి ప్రకారం చిట్యాల మండలం, ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అనే యువతిగా నిర్ధారించారు.వర్షిణీ తండ్రి కుమారస్వామి రెండు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఆవేదనతో ఈ నెల 3న వర్షిణీ ఇంటి నుంచి వెళ్లిపోయింది.దీంతో తల్లి కవిత పలు చోట్ల ఆరా తీసి 6వ తేదీన చిట్యాల ఠాణాలో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మిస్సింగ్‌ కేసుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వర్షీణీ మృతదే హం లభ్యం కావడం కలకలం రేపింది. 
అనేక అనుమనాలు :
ఇంటి నుంచి వెళ్లిపోయిన వర్షిణీ అనుమానస్పందంగా మృతి చెందడంపై పలు రకాల ప్ర శ్నలు తలెత్తుతున్నాయి.3వ తేదిన ఇంటి నుంచి వెళ్లిన వర్షిణీ ఇంతకాలం ఎక్కడ ఉం దనే అనుమానాలు వస్తున్నాయి.ఆమెను ఎవరైనా నమ్మించి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.20రోజుల క్రితం అదృశ్య మైన యువతి ఈ అడవిలోకి ఎందుకొచ్చింది.హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుం దా..? చంపి మృతదేహాన్ని పడేసి...ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.యువతిని చంపి క్షుద్రపూజల వైపు దృష్టి మళ్లేలా చేశారా అనేది తేలాల్సి ఉంది.ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు,కాల్‌ డేటా సే కరించే పనిలో నిమగ్నమయ్యారు.త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు తేల్చి చెప్పా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....