అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగం...ఎం.ఏ.హఫీజ్ ఖాన్,కర్నూలు మాజీ ఎమ్మెల్యే...
అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగంఎం.ఏ.హఫీజ్ ఖాన్,కర్నూలు మాజీ ఎమ్మెల్యే
జర్నలిస్టులు,రాజకీయ నాయకులు, సమాజ పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేం దుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగం అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ అ న్నారు.శనివారం కర్నూలు నగరం,ఎ.క్యాంప్ లో నూతనంగా కేటాయించిన కర్నూలు ప్రె స్ క్లబ్ ను మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ జిల్లా సందర్శించారు.ఈ సందర్బంగా వారు సీనియర్ జర్నలిస్టులు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా, సీనియర్ ఫో టోగ్రాఫర్ కరణ్,రాము, సీనియర్ రిపోర్టర్ సత్యనారాయణ, రిపోర్టర్ చంద్రశేఖర్‌లను క లిశారు.అనంతరం హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్‌ను కేటాయించినందుకు జిల్లా క లెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ ఫైల్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశా రు.ఆయన అకాల మరణం తరువాత ఈ ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు.జిల్లా కలెక్ట ర్,అన్ని రాజకీయ పార్టీలు,జర్నలిస్టు సంఘాలు కలిసి అత్యాధునిక ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.ప్రస్తుత ప్రభుత్వ నిధులతో పాటు గ్రీన్ కో,జై రాజ్ స్టీల్,ఇతర కార్పొరేట్ సంస్థల సిఎస్ ఆర్ నిధులు సమీకరించాలని సూచించారు. మంచి సౌకర్యాల తో కూడిన ప్రెస్ క్లబ్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలం టూ విజ్ఞప్తి చేశారు.ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఒక చెట్టు నాటి పచ్చదనానికి తన వంతు సహ కారం అందించారు.
Comments
Post a Comment