భార్యకు తిండి పెట్టకుండా...విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త...
భార్యకు తిండి పెట్టకుండా...విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త
కొత్తగూడెం జిల్లాలో భర్త,భార్యకు తిండి పెట్టకుండా విగతజీవిలా మార్చి హతమార్చిన ఘ టన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...ఖమ్మం జిల్లా,కల్లూరు మండలం,విశ్వన్నాథ పు రం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు,ఖాన్‌ఖాన్ పేట గ్రామానికి చెం దిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా,మూడేళ్ల నుండి అశ్వారావు పేట లో దంపతులు నివాసం ఉంటున్న ఉంటున్నారు.అయితే లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కింద పడిపోయిందని,ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు నరేష్ బాబు ఫోన్ చేసి చెప్పాడు.ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి,దీనస్థితిలో ఉన్న లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూ సి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.శరీరమంతా కొత్త గాయాలు,పాత గాయాల ఆన వాళ్లు చూసి లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని,అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీప్రసన్నను హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Comments
Post a Comment