దోపిడి ముఠా అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ..

దోపిడి ముఠా అరెస్ట్
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో భాగంగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేసినట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు తెలియచేశారు. కర్నూలు నగరం,ముజాఫర్ నగర్ కు చెందిన గోర్లగట్ట నాగేంద్రుడు,బుధావర్ పేట,ప్రస్తుతం TV9 కాలనీకి చెందిన కురువ రమేష్,కర్నూలు మండలం, దిన్నేదేవరపాడు గ్రామానికి చెందిన దూదేకుల మాలిక్ బాషలు కర్నూలు బెంగళూర్ జాతీయ రహదారి 
44,జగన్నాత గట్టుపై వెళ్లే ప్రేమికుల దగ్గరకు వెళ్లి వారి ఫోటోలు,వీడియోలు తీసి,వారిని బ్లాకు మెయిల్ చేస్తూ వారి నుండి డబ్బు,విలవయిన వస్తువులు తీసుకొని,ఇవ్వని వారిపై మరణాయుధాలతో చంపుతామని బెదిరించి వారి నుండి,డబ్బు,బంగారు లేదా విలువయిన వస్తువులను బలవంతంగా తీసుకొంటూ దోపిడీకి పాల్పడేవారు.అదేవిదంగా ఈనెల 19వ తేదీన పిర్యాదురాలు తనకు తెలిసిన అబ్బాయితో రాయలసీమ యూనివర్సిటీకు ఆటోలో వెళుతుండగా, అమ్మాయి,అబ్బాయిలు వెళుతున్న ఆటో ను అనుసరిస్తూ హ్యాంగౌట్ హోటల్ దాటినా తర్వాత ఆ ఆటోను ఆపి అమ్మాయి,అబ్బాయి ఫోటోతీసి,మీ తల్లిదండ్రులకు పంపుతామని,కత్తితో బెదిరించి అమ్మాయి నుండి బంగారు గొలుసు,అబ్బాయి నుండి రూ.2000 నగదు ఫోన్ పే చేయించుకొని,జేబులో ఉన్న రూ.1000 లాక్కొని తిరిగి రెండు రోజుల తర్వాత అమ్మాయి ఫోన్ కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఆధారముగా ముద్దాయిలను గుర్తించి నేడు ముద్దాయిలను కర్నూలు-బెంగళూ ర్ హైవే,ఖైరా కేఫ్ దగ్గర ఆరెస్టు చేసి వారి నుండి రూ.10,500 నగదు,బంగారు చైను,ముద్దాయిలకు సంబందించిన మూడు మొబైల్ ఫోన్స్,ఒక కారు,స్కూటీ, ఒక కత్తి,ఐదు లీటర్ల నాటుసారాను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యలు నిమిత్తం విచారణ ప్రారభించినట్లు సిఐ తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి :

పట్టణ శివార్లలో ప్రేమికుల జంటలు గాని, స్త్రీ,పురుషులు సంయుక్తంగా వెళ్ళడం గాని,ఏకాంతముగా గడపడంగాని చేయవద్దు.అలా వెళ్లి ఇలాంటి వారి చేతులలో తమ జీవితాలను నాశనం చేసుకొవద్దని అని నాల్గవ పట్టణ పోలీసులు యువతను హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి వారి భారిన పడిన యెడల అట్టి సమాచారం ను డయల్ 112 గానీ,లేదా 91211 01062కు ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...