పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్ ఎటాక్...
పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్ ఎటాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను,డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కే సు మరోసారి చర్చగా మారి రచ్చకు దారితీస్తోంది.సుగాలి ప్రీతి తల్లి పార్వతి కామెంట్లపై జ నసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడం.ఆ తర్వాత జనసేన కౌం టర్ ఇవ్వడంతో రచ్చగా మారింది.ఇక,మరోసారి స్పందించిన సుగాలి ప్రీతిబాయి తల్లి పా ర్వతి,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అ య్యాక చాలా సంతోషించాం.కూటమి ప్రభుత్వం వచ్చి 14నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.ఎస్సీ,ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి,5 స్థలం,ఉద్యోగం ఇచ్చారు.అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా ? అని ప్రశ్నించారు.అయినా,నేను డబ్బుకోసం పోరాటం చేయడం లేదు.నా కూతురు చ నిపోయిన రోజే డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యా ణ్ ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశారు.
పవన్ కల్యాణ్ మాట తప్పారు :
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడా ఈ కేసు తీసుకెళ్లారు.ఇప్పడు పవన్ కల్యాణ్ పై ఒత్తి ళ్లు వస్తున్నాయా,ప్రలోభాలకు లొంగిపోయారా? అంటూ మండిపడ్డారు పార్వతి...14 నెలలుగా ప్రీతిబాయి కేసు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం తప్పా? అని నిలదీ శారు.నటి జత్వాని కేసులో ఎలా జైలుకు పంపారో...ప్రీతిబాయి కేసులో విచారణాధి కా రులకు నార్కో అనాల్సిస్ టెస్ట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు ప్రీతిబాయి తల్లి పార్వ తి...కాగా,సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్...తాను,డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సు గాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.ఆ పాపకి న్యాయం జరగాలి.ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.సీఐడీ చీ ఫ్,డీఐజీ,హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను.బాధిత కుటుంబానికి న్యాయం జరి గేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పాను.అయితే అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చె పుతున్నారో DNA తారుమారు చేశారు.ఒత్తిడి చేసి భూములు ఇచ్చేసి సాక్ష్యాలు తారు మారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.DNA సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అ ని పోలీసులు చెపుతున్నారు ఇది వాస్తవం.ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ ప్రా రంబిస్తే ఆసలు దోషులు పట్టుబడే అవకాశం లేకపోలేదు.వివేకానందరెడ్డిని చంపేశారు అని అందరికి తెలుసు.ఎవరు అయితే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. మరి గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ కృషి ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment