బ్రాహ్మణపల్లి కానుగుల రాజారావుకు న్యాయం చేయాలి...తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి...విజయ్ కుమార్,ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి...
బ్రాహ్మణపల్లి కానుగుల రాజారావుకు న్యాయం చేయాలితప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలివిజయ్ కుమార్,ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి
కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారా వుకు న్యాయం చేయాలనీ ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్ అధికారులను కోరారు.గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రై ట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎపి ఇంచా ర్జి విజయ్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు విజయ్ కుమా ర్,ఉపాధ్యక్షులు పరమేష్ లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం,జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యా యం చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలం,బ్రాహ్మణపల్లి గ్రామంలోని 177/సి సర్వే నెంబర్లు లో ఐదు ఎకరాల భూమిని కానుగుల సత్యరాజు కుటుంబ సభ్యులు రెండు తరాలుగా సా గు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో వారసత్వంగా కానుగు ల రాజారావు సైతం భూమిలో అనుభవంలో ఉన్నాడు.అయితే ఎపిఐఐసి వారు సర్వే రి పోర్ట్ లో మండల రెవెన్యూ,రెవెన్యూ డివిజన్ అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం ద్వారా బాధితుడికి అన్యాయం జరిగిందని చెప్పారు.వారి రిపోర్ట్ ఆధారంగా ఎపిఐఐసి వారు ఎలాంటి విచారణ చేపట్టకుండానే బాధితుడు సాగు చేసుకుంటున్న భూమిని స్వా ధీనం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది అని పేర్కొన్నారు.భూమిలోకి రైతు కాను గుల రాజారావును భూమి సాగుచేయకుండా భయాందోళనకు గురి చేయడం బాధాక రం అని ఆవేదన చెందారు.బాధితుడు కానుగుల రాజారావు న్యాయం కోసం జిల్లా అధి కారులు,డివిజన్ మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక దపాలుగా ఫిర్యా దు చేసిన అధికారులు స్పందించకపోవడం సరైందికాదన్నారు.కావున ఇప్పటికైనా బా ధితుల సమస్యపై సమగ్ర విచారణ చేపట్టి,ప్రస్తుతం APIIC ZO,అధికారులు బాధితు ల పట్ల మానవతా దృక్పధంతో 2014-2015 సంవత్సరం భూసర్వేలో జరిగిన అవ క తవకలను గుర్తించి,బాధితుడికి తగిన నష్టపరిహారం అందించడంతోపాటు, బాధితుడి ని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగిన న్యాయం చేయాలనీ,లేనిపక్షంలో బాధితుడి తరుపున ఓర్వకల్ మండల రైతులను చైతన్యం చేసి ఆర్జియన్ హ్యూమన్ రై ట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని వారు తె లిపారు.
Comments
Post a Comment