హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం... స్తంభించిన జనజీవనం...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం స్తంభించిన జనజీవనం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గంట సేపటి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.హిమాయత్ నగర్,నారాయణ గూడ,ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్,ట్యాం క్ బండ్,అంబర్ పేట్,కాచిగూడ,ఓయూ క్యాంపస్,విద్యానగర్,బంజారా హిల్స్,జూబ్లీహి ల్స్,అమీర్ పేట్,పంజాగుట్ట,ఖైరతా బాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.భారీ వర్షం కార ణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లకిడీకాపూల్,ఖైరతాబాద్,పంజాగుట్ట,అమీర్‌పేట్ సెక్రటేరియట్,ట్యాంక్ బండ్,తెలుగు తల్లి ఫ్లైఓవర్,ఐమాక్స్,ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కిలోమీటర్ ప్రయాణం కోసం గంటల సమ యం పడుతోంది.కాగా భారీ వర్షాల నేపథ్యంలో నగర వాసులకు వాతావరణ శాఖ కీల క హెచ్చరికలు జారీ చేసింది.అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసిం ది.
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్,2వ తేదీ వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలి పింది.తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.శనివా రం ఆదిలాబాద్,కొత్తగూడెం, హన్మకొండ,జగిత్యాల,భూపాలపల్లి,కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్,మంచిర్యాల,మెదక్,ములుగు,నిర్మల్,నిజామాబాద్,పెద్ద పల్లి,రాజన్న సిరిసిల్ల,వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు ప డతాయని తెలిపింది.
Comments
Post a Comment