అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలి...అర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత...సిఎస్...
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫించన్ అందాలిఅర్హత ఉండి ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత...సిఎస్
రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి,ఫించన్ రాలేదని ఫిర్యాదువస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టర్లే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.మైనర్ ఇ రిగేషన్ ట్యాంకులు,భుగర్భ జలాలు,పియం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశా లు,పింఛన్లు,జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు,ఇండియన్ ఎయిర్ ఫో ర్స్ సంబంధిత అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో స మావేశంలో మాట్లాడారు.ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు.ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు,జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్ప క పాల్గొనాలని ఆదేశించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధా న్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడా లని చెప్పారు.అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా,సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహిం చాల్సి ఉంటుందని పునరుద్ఘాటించారు.పెన్షన్ల తనిఖీకి సంబంధించి 1.35 లక్షల మందికి నోటీసులు జారీ చేసి,నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పిల్ చేసుకోవాలని తెలి యజేయగా వారిలో 88.319వేల మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోగా,ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదని గుర్తుచేశారు.నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరి ష్కరించాలని కలక్టర్లను ఆదేశించారు.పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రా కుండా చూసుకోవాలని,అర్హత కలిగిన వారందరికీ తప్పనిసరిగా ఫెన్షన్ అందేలా చర్య లు తీసుకోవాలని స్పష్టం చేశారు.అంతకు ముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,భూగర్భ జలాల పెంపు,పియం కుసుమ్ ఫధకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా జు వనైల్ జస్టీస్ కమిటీలు ఏర్పాటు,యూరియా లభ్యత తదితర అంశాలపై కలక్టర్లతో సిఎస్ సమీక్షించారు.ఈ సమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్మి,ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్,ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల,వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు,నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు,రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్,సె ర్ప్ సిఇఓ కురుణ,మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి,వివిధ జిల్లాల కలె క్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
Comments
Post a Comment