విభాగాల మధ్య సమన్వయం అవసరం... మున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...
విభాగాల మధ్య సమన్వయం అవసరంమున్సిపల్ షాపులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులుబాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుపి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్
కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారానికి విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అ ని,విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను హెచ్చరించారు.శనివారం ఆయన పెద్ద మార్కెట్,వినాయక ఘాట్ వద్ద ము న్సిపల్ దుకాణాలు,పరిసర ప్రాంతాలు,కింగ్ మార్కెట్ కమ్యూనిటీ హాల్,కిడ్స్ వరల్డ్ వద్ద డ్రైనేజీ కాలువ ఓవర్‌ఫ్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ...నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అవసరమైన మరమ్మ త్తు పనులను ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని ఆదేశించారు.ఖాళీగా ఉన్న షాపుల పరిస్థితిని రెవెన్యూ ఇన్ స్పె క్టర్లు తరచూ పర్యవేక్షించాలని సూచించారు. అలాగే,బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్ప ష్టం చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వీడి,ప్రజా సేవలో బాధ్యత,చిత్తశుద్ధి, నిబద్ధతతో వ్యవహ రించాలని కమిషనర్ అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డా.విశ్వేశ్వర్ రె డ్డి,ఆర్‌ఓ జునైద్,సిబ్బంది అనిల్,సు హైల్,రాజు,మన్సూర్,స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment