వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

VS9TV న్యూస్,హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు.ప్రజలకు ఎక్కడ ఇ బ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పురాతన ఇళ్లలో ఉంటున్న వా రిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూ చించారు.తెలంగాణ జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైం ది.ఇళ్లలోకి వరద నీరు చేరింది పంటలకు తీవ్ర నష్టం కలిగింది.మరోవైపు భారీ వర్షాలు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్,నిర్మల్,సిరిసిల్ల,జిల్లాలను గురువారం పరి శీలించారు.కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయ ని,ఈ నేపథ్యంలో కామారెడ్డి,మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు, సంగా రెడ్డి,సిద్దిపేట,యాదాద్రి భువనగిరి సహా పది జిల్లాలకు ఆరెంజ్,మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.ఈ అల్పపీడనం రాగల 24గంటల్లో ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేప థ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అప్రమ త్తమైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవా రం సాయంత్రం ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీ సుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.వర్షాల కారణంగా ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్ నగరంలో హైడ్రా,ఎస్‌డీఆర్‌ఎఫ్,జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, పోలీసు బృందాలు నిరం తరం అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.వినాయక చవితి ఉత్సవాల వేళ విద్యుత్ స్తంభాలు,ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా జా గ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బందికి సూచించారు.నదులు,వాగులపై ఉన్న లోతట్టు వంతెనల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంటే రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని చెప్పా రు.చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారు లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని,ప్రభుత్వ ఆసుప త్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని,అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏ ర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...