పాత్రికేయ గణపతిని దర్శించుకున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య...
పాత్రికేయ గణపతిని దర్శించుకున్నజాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య
కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలోని సమాచార శాఖ మీడియా పాయింట్ నందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్రికేయ గణపతిని కర్నూలు జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జెసి నవ్య మాట్లాడుతూ పాత్రికేయులు సమాచారాల సేకరణతో పాటు ఆధ్యా త్మికంగా గణనాథుని ఏర్పాటు చేసి,పూజా కార్యక్రమాలు,అన్నదాన కార్యక్రమాలు,అలాగే పర్యావరణ హితాన్ని కోరుతూ మట్టి వినాయకుడిని స్థాపించి సమాజానికి మట్టి వినాయ కుల ప్రాముఖ్యతను తెలియజేయడం అభినందనీయం అన్నారు.
ఇలాగే ప్రతి సంవత్సరం ప్రజా సేవతో పాటు,ఆధ్యాత్మిక సేవ చేస్తూ విలేకరుల ఐకమత్యా న్ని చాటి చెప్పాలని,ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ కలగాలని వారు కో రారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి యా మంజునాథ్ శ్రీనివాసులు,విద్యాసాగర్ రామకృష్ణ,ప్రసాద్,విజయ్ కుమార్,ఆసిఫ్,శ్రీ నాథ్ రెడ్డి,అవినాష్,కిషోర్,పరమేష్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment