ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్...
ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను సిఫార్సును చేస్తూ తెలం గాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కో ట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది. అయితే రేవంత్ సర్కార్,కోదండరాం పేరుతో పా టు ఈసారి అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు స్థానం కల్పించింది.తెలంగాణలో ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది.షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్‌లో స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని...ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాకుండా...రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తె లిపింది.స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎ త్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.కాగా...ఎమ్మెల్సీలుగా కో దండరాం,అమీర్ అలీఖాన్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసింది.అయితే...జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ ఎంపిక ఆసక్తికరరంగా మారింది.
Comments
Post a Comment