నగరపాలక సంస్థలో వినాయక చవితి వేడుకలు...
నగరపాలక సంస్థలో వినాయక చవితి వేడుకలు
వినాయక చవితి సందర్భంగా కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో వినా యకుని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు.మేయర్ బి.వై.రామయ్య,కమిషనర్ పి.విశ్వనాథ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ నగ ర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించి శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు.అందరూ భక్తి శ్రద్ధలతో గణనాథుని ఆశీర్వాదా లు పొందాలని కోరుకున్నారు.మండపం వద్ద వినాయక నామస్మరణతో మార్మోగింది.పూ జల అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,కార్పొరేటర్ విక్రంసింహా రెడ్డి,మేనేజర్ చిన్నరాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్,ఎంఈ మనోహర్ రెడ్డి,సూపరింటెండెం ట్ రామక్రిష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment