జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడతాం...సిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు హామీ...
జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడతాంసిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు హామీ
జర్నలిస్టుల బహుళ అంతస్థుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడ తామని సిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు తెలిపారు.అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సిఆర్డీఎ కమిషనర్ ను ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు.ఈ సం దర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వం బహుళ అంతస్తుల హౌసింగ్ ప్రాజెక్ట్ నిమి త్తం మందడంలో కేటాయించిన 30ఎకరాలు భూమి వివరాలు సర్వే నెంబర్లతో కూడిన మంజూరు పత్రాలను కమిషనర్ కి అందచేయడం జరిగింది.ఈ సందర్బంగా గత తెలుగు దేశం ప్రభుత్వంలో 2014-19 మధ్య కాలంలో జర్నలిస్ట్ లకు అమరావతిలో ప్రతిపాదిం చిన హౌసింగ్ ప్రాజెక్ట్ ను తిరిగి అమలు చేయాలని కోరుతూ జర్నలిస్టులు వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ అమరావతిలో జర్నలిస్టుల కోసం గత టీడీ పీ ప్రభుత్వంలో భూమి కేటాయించగా తదుపరి ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ అమలు ని లిచిపోయిందని జర్నలిస్ట్ లు వివరించారు.తిరిగి ప్రాజెక్ట్ ను కొనసాగించి,ప్రభుత్వమే బ హుళ అంతస్తుల భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇందు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింద ని,ప్రతిగా ప్రభుత్వం కొంత రాయితీతో హ్యాపీ నెస్ట్ మోడల్ లో నిర్మిస్తామన్న ప్రభుత్వ ఉత్త ర్వుల ప్రతులను కమిషనర్ గారికి అందచేసినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ నేపథ్యం లో నాలుగు కేటగిరీలుగా నిర్మాణం జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి కూడ అంతర్జాతీ య ప్రమాణాలతో దేశంలోనే ఒక మోడల్ జర్నలిస్ట్ కాలనీ నిర్మించాలని అధికారులను ఆ దేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.ఇటీవలే మున్సిపల్ శాఖ మం త్రి పి.నారాయణని కలిసి వివరించగా,వారు కూడ సుముఖంగా తగిన చర్యలు తీసుకుం టామని తెలిపారని వివరించారు.అనంతరం కమిషనర్ స్ఫందిస్తూ మంత్రివర్గ ఉపసం ఘంలో పెడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగి సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు,సొసైటీ డైరక్టర్ చావా రవి,సీనియర్ జర్నలిస్ట్ దారం వెంకటేశ్వరరావు,ప్రెస్ ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు సాంబశివరావు,తదితరు లు ఉన్నారు.
Comments
Post a Comment