యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కు సహకరించాలి...చంద్రయ్య,ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్...
యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కు సహకరించాలిచంద్రయ్య,ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్
కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని యూనియ న్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ కి సహకరించాలని ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ చంద్రయ్య తెలి పారు.సోమవారం ఉదయం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సభ్యత కార్యక్రమం ప్రారంభించా రు.మొదటి సభ్యత్వం అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్త తీసుకున్నారు.అనంత రం ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ చంద్రయ్య సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రెస్ క్లబ్ కార్యాలయాలు ఉన్నాయని కానీ కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడం లోటుగా ఉండిందని అని తెలిపారు.సీనియర్ జ ర్నలిస్ట్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ప్రతి యూనియన్ సభ్యులు ప్రతి మీడి యా పాత్రికేయులు ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరమని,ప్రోత్సాహం సహకారం ఉండాలని ఆయన తెలిపారు.ప్రజా సంఘాలు,మధ్యతరగతి,సామాన్యులు ఎ దుర్కొనే అనేక సమస్యలకు పరిష్కార వేదిక అవుతుందని చెప్పారు. సామాన్యులకు ఏదై నా సమస్య వస్తే తమ సమస్యను చెప్పుకోవడానికి వేదిక లేదని రోడ్డుపైన ధర్నా,నిరసన చేసుకుంటూ వస్తున్నారని అన్నారు.కానీ ప్రెస్ క్లబ్ ఏర్పాటు ప్రజాసంఘాలకు సామాన్యు లకు మధ్యతరగతి వారికి ప్రతి ఒక్కరికి ఒక వేదిక అవుతుందని తన ఆశిస్తున్నట్లు పేర్కొ న్నారు.ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని,సొంత భవనం నిర్మాణానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రెస్ క్లబ్ కార్యాలయంకు అద్దె లేకుండా చూడాలని జిల్లా కలె క్టర్ ను ఆయన కోరారు.
Comments
Post a Comment