రూ.334 కోట్ల అవినీతి...చైనా మాజీ మంత్రికి మరణశిక్ష...
రూ.334 కోట్ల అవినీతి...చైనా మాజీ మంత్రికి మరణశిక్ష
చైనా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.అవినీతి చర్యల్లో భాగం గా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు జిలిన్ ప్రావిన్స్ కోర్ట్ మరణశిక్ష విధించింది.వివ రాలు ఇలా ఉన్నాయి...రూ.334 కోట్ల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయన పై ఈ మేరకు చర్యలు తీసుకుంది.అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవిత కాల నిషేధం విధిస్తూ...జిలిన్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పు చెప్పింది.ఆయన వ్యక్తిగత ఆస్తు లను జప్తు చేయాలని,లంచం సొత్తునూ స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగిం చాలని ఆదేశించింది.
Comments
Post a Comment