35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు నిర్మించాలి...సిపిఎం...
35వ వార్డు,శివప్ప నగర్ లో రోడ్లు,కాలువలు నిర్మించాలి...సిపిఎం
కర్నూలు నగరపాలక సంస్థ కల్లూరు 35వ వార్డు,శివప్ప నగర్ కాలనీలో రోడ్లు,కాలువ లు నిర్మించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు బి.కే.రామకృష్ణ వార్డ్ కార్యదర్శి బి.పరమేష్,సూర్యనారాయణ కోరారు.సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం లో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణకి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యులు బి.కె.రామకృష్ణ మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దాదాపు 20సంవత్సరాలు అవుతున్నట్లు తెలిపారు.చింత లముని నగర్ లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎదురుగా ఉన్న శివప్ప నగర్ కాలనీలో అనేక మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారని,కాలనీలో రోడ్లు లేక వర్షం పడిందంటే మొ త్తం బురదమయమై,ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆందో ళన చెందారు.వర్షం పడిందంటే వర్షం నీళ్లు నిలువ ఉండి దోమలకు నిలయంగా మారి రాత్రిపూట దోమల బెడదతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. దోమ ల బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు.కాలువలు లేని కారణంగా మురి కి నీరు రోడ్లపై పారుతూ వచ్చిపోయేవారికి దుర్వాసన వెదజల్లుతూ,మురికి కూపంలో రో డ్లు ఉన్నాయని తెలిపారు.వెంటనే డిప్యూటీ కమిషనర్ చొరవ తీసుకొని 35వ వార్డు శివ ప్ప నగర్ లో పర్యటించి సిసి రోడ్లు కాలువలు వేయాలని వారు డిమాండ్ చేశారు.అనం తరం అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ సంబంధిత అధికారులకు కాలనీలో పర్యటించి సమ స్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బి.పర మేష్ ,జే.శ్రీనివాసులు,పి.మాధవ్,రాజన్న,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment